అమ్మ చూపు ! Mother

  మిట్టమధ్యాహ్నం ఎండలో  

 తదేకంగా దారిని  చూస్తున్న ముసలమ్మ ను*

 ఒక బాటసారి అడిగాడు 

 అమ్మా ఎవరి రాక కోసం 

 చూస్తున్నావు  ఎండలో. 

 అమ్మ సమాధానం 

 సంవత్సర క్రితం బతుకు *దెరువు కోసం పట్నం పోయిన 

 *నా కొడుకు ఈ బాటలో 

 ఎప్పుడైనా వస్తాడేమో అని పోయిన రోజు నుండి ఎదురు* 

 చూస్తున్నే వున్న అనడం తో* 

 నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి .* 

母亲

వెల్మజాల నర్సింహ ✍🏻

 
Au soleil de l'après-midi

 A la vieille femme qui fixe la route*

 demanda un passant


 Amma pour qui l'arrivée

 Vous voyez au soleil.


 Maman a répondu

 Il y a un an, Batuku a quitté Patnam pour *Deruvu

 *Mon fils est sur ce chemin

 Attendre depuis le dernier jour pour voir s'il viendra un jour*

 En disant que vous regardez

 Les larmes ont coulé dans mes yeux.*

la mère

 

స్త్రీ Woman


తొలి సంగమంలోస్త్రీకి కలిగే 

సహజమైన మైకం

 ఆమెని చుట్టుముట్టగా 

ఆమె అలాగే 

నేలమీదకు జారిపోయింది

ఆమె చూపులు మత్తెక్కించే నిండు జాబిలి

తనువు వర్షాకాలంలో 

తొలి చినుకు కే తడిసిన నిలాంబరి.

గఢీలా పాలన

దోచి కట్టినా గఢీలు 

కూలే దోరలు 

చచ్చిరి 

 నాటి కష్ట జీవుల శ్రమ 

నేడు మా ఊరి 

పాత గోడలయ్యే

  ****************

 . వెల్మజాల నర్సింహ.

దశాబ్దాల పాటు కొనసాగే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వారి మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

మీరు మీ లక్ష్యాన్ని ఎంత త్వరగా చేరుకుంటారు, 
మీరు ఎంత త్వరగా పని చేయగలరు అనే దాని నుండి
 మీ దృష్టిని మార్చండి మీ భావోద్వేగాలను నియంత్రించండి.
 మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, 
మీ మంచి తీర్పును అధిగమించడానికి 
మీ భావోద్వేగాలను ఎప్పుడూ అనుమతించవద్దు,
 మీరు మంచి అర్హత కలిగి ఉన్నారని తెలుసుకుని,
 ఆపై దాని కోసం పని చేయడం స్వీయ రక్షణ, 
మనిషిగా మీరు చేయగలిగిన గొప్పదనం
 ఏమిటంటే, మీ జీవితంలో జరిగే 
ప్రతిదానికీ పూర్తి జవాబుదారీతనం వహించడం
: ఆరోగ్యం, ఫిట్‌నెస్, విశ్వాసం, ఆర్థికం, సంబంధాలు
, మనిషిగా బలహీనంగా ఉండకండి. బలహీనత
 ఎప్పుడూ ఎవరికీ ఆకర్షణీయమైన లక్షణం కాదు
. బలహీనమైన పురుషుడిని ఏ స్త్రీ కోరుకోదు.
 ఏ తల్లిదండ్రులు బలహీనమైన కొడుకును కోరుకోరు. 
బలహీనమైన తండ్రిని ఏ బిడ్డ కోరుకోడు. తోటి పురుషులు
 బలహీనమైన పురుషులను స్నేహితులుగా కోరుకోరు
. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు నిర్మించుకోండి,
 మీరు భయం & భయం యొక్క లెన్స్ ద్వారా ప్రతిదీ వీక్షిస్తే,
 మీరు రిట్రీట్ మోడ్‌లో ఉంటారు.
 మీరు సంక్షోభం లేదా సమస్యను సవాలుగా సులభంగా చూడవచ్చు, 
మిమ్మల్ని మీరు బలపరుచుకునే మరియు
 దృఢంగా మార్చుకునే అవకాశం,
 పనులు చేయడానికి ఎల్లప్పుడూ కొత్త & మెరుగైన మార్గాలు ఉన్నాయి
మీ వృద్ధిని వేగవంతం చేయడానికి ఓపెన్ మైండ్ ఉంచండి.
 దృష్టి కేంద్రీకరించండి. ఇది మెరుగుపడుతుంది,
 ఎదగడానికి వెళ్ళనివ్వండి. నిర్లిప్తత శక్తి. మిమ్మల్ని నిరుత్సాహపరిచే
 మీకు సేవ చేయని అన్ని వస్తువులను
 విడుదల చేయండి, చిరాకుగా అనిపించినప్పుడు
, బయటికి కాకుండా లోపలికి చూడండి.
 మీరు చేస్తున్న ఏదో పనికిరాని పని ఉంది, 
వాటిని మెరుగుపరచడానికి వాటిని సరిదిద్దవచ్చు,
 ఇప్పుడు కష్టకాలంలో ఉన్నందున,
 మీరు ఎప్పటికీ ఒకటిగా ఉండబోతున్నారని కాదు. 
అంతా కాలానుగుణం,

మన జీవితాలను చక్కగా మరియు సంతోషంగా ఎలా పెట్టుబడి పెట్టాలి ?

 

జీవితాన్ని నేర్చుకోండి.

 మీరు మీపై పందెం వేయకపోతే 

మీపై ఎవరు పందెం వేస్తారు? ,

మనకు జరిగే చాలా చెడు విషయాలు

 మన మనస్సులో మాత్రమే ఉంటాయి,

మీ ప్రేమను ఉచితంగా ఇవ్వడం

 ద్వారా మీరు ప్రేమను పొందలేరు,

జిమ్‌లో మంచి రోజు అంటే చాలా 

నెలలు మరియు నెలలలో

 పదే పదే పునరావృతం కాకుండా ఉంటుంది,

వ్యాపారంలో మంచి రోజు దీర్ఘకాలం పాటు 

స్థిరమైన ప్రయత్నం లేకుండా గొప్ప జీవనశైలికి సమానం కాదు,

మీరు అస్సలు ప్రయత్నించనప్పుడు 

మరియు నిష్క్రియాత్మకతను ఎంచుకున్నప్పుడు 

సిగ్గుపడండి. వారు విఫలమైనప్పుడు చాలా మంది

 సిగ్గుపడతారు & ఇది వారిని నిష్క్రియంగా చేస్తుంది,

ఎక్కువ కష్టపడు . మీ దృష్టి అంతా మిమ్మల్ని 

మీరు మెరుగుపరుచుకోవడం మరియు

 ప్రతిరోజూ ధనవంతులు కావడంపైనే ఉండాలి,

భవిష్యత్తు గురించి ఎదురుచూడడం & చింతించడం

 వ్యర్థం. ఇది ఇప్పటికే ఒక్కో క్షణం మీ ముందుకు వస్తోంది

. ప్రస్తుతానికి హాజరవ్వండి,

పోరాటం యొక్క మొదటి సంకేతం వద్ద నిష్క్రమించే 

వ్యక్తిగా ఉండకండి. ఆత్మవిశ్వాసం ప్రధానం,

ప్రతి రోజు మీ లక్ష్యాల కోసం అవిశ్రాంతంగా 

పని చేయడం అతిపెద్ద ఆనందం,

గురువు

 *అక్షరం నాశనం 

 లేనిది .* 

 ఎలాగంటే 

 *సరైన శిల్పి (గురువు) 

 చెతిలో గుది బండ 

 కూడా గుడిలో *

 మూలవిరాట్ కాగలదు

మేడే MAY DAY



 మండే ఎండలు 
 మనుషుల వ్యధలు 
 కాయకష్టం 
 దోచుకున్నే దొరలు 

 ఇంకానా ఇకపై సాగాదు 
 పేదల బావుటా నిలిచిన 
 మేధావులు 
 పోరాటాలే చెశారు 
 పని గంటలానే  కుదించారు 

 కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి 
 అంతర్జాతీయంగా 
మేడే 
 ఎరుపు పోందే 


वेलमाजला नरसिंहा

నాదేశం నా జెండా


 నాదేశం' భరతవంశ గడ్డ

పలు సంస్కృతుల అడ్డా

సింధూ నది ఒడ్డున 

హిందూ దేశం  గా  పిలువబడుతుా

ఆసేతు హిమాచలం

మనకుండే రక్షణ కవచం 

గంగ, యమున,కృష్ణ లే కాదు 

 బ్రహ్మపుత్ర,  గోదావరి జలాలతో 

పచ్చని పంటలు పండిస్తుా

అన్నపుార్ణ గా వెలుగొందే 

నాదేశం మా కెంతో గర్వం 

బహు భాషాల మనుషులు

సర్వ మతా కులాలు 

 భిన్నత్వంలో ఏకత్వం

వందేమాతరమే మా నినాదం 

వసుధైక కుటుంబం 

 నాదేశం గొప్పదనం 


నాదేశానికి త్రివర్ణజెండా 

మా గుండెలల్లో నిండా 

పింగళి వెంకయ్య గారు 

 రూపొందించేనా జెండా  

భారత జాతి మది నిండా

మధ్యలో అశోక చక్రంతో 

కాషాయం, తెలుపు, పచ్చ

 రంగుల మిళితమై 

నేడు రెపరెపలాడే గగనంల లో

 నాజెండా

నాదేశం నాజెండా 

ప్రతి భారతీయుడి యేద నిండా


వెల్మజాల నర్సింహ 

Mob:9867839147

కవన కిరణం కందికొండ

 తన ఊపిరి పాట 

తన బ్రతుకే కవిత్వం

అమ్మా అయ్య లా మాటలతో

అల్లిన కవితాల సుమహారం

బతుకమ్మ పాటలతో

 పల్లె గొంతులను వినిపించే

పల్లె ప్రజల నాడీ బాణీ 

తెలిసిన వాడీ కలం

తెలంగాణ యాస 

సినిమా తెరపై మన భాషా

మళ్ళీ కూయవే గువ్వా

మనసుకు తాకిన మువ్వ

చక్రి గారి మైత్రి 

అందమైన పాటల తోట

V6 బతుకమ్మ పాటలు

పల్లె గొంతులో కూతలు

తెలంగాణ బిడ్డావ్వని

తెగ మురిసే పల్లె జనం

తంగేడు పువ్వుల లాంటి

పదాల పాటే మన కందికొండ

కాన్సర్ ను జయించి

కానరాని లోకాలకు

 పయనమైతివి

కవన కిరణం కందికొండ

జనం నాలుకల పై కొలువుండ

   

**

వెల్మజాల నర్సింహ

దుప్పల్లి


చరవాణి.9867839147.



గుడ్డి దీపం

తాటాకు పై గంటాతో

తాపత్రయ పడ్డారు

రాయడానికి

వారు రాశారు ఎన్నో

 గొప్ప పురాణాలు

రాతి పై ఎక్కేన శాసనాలు

ఇంకు బాటిల్ పెన్ను

గుడ్డి దీపం కన్ను

రాశారు ఎన్నో గొప్ప కావ్యాలు

తెల్ల పేపర్ వచ్చే

 సులభమైన కలం

ప్రేమ పాటలు రాసినా

 కవులకు సలాం

కంప్యూటర్ కాలం

 కావ్య

ముద్రణ రాజ్యం


లక్షలో పుస్తకాలు,

 చదవడం లేదుగా

ఓప్పిక లేని జనం

కానరాని కవులూ ,

ఇదే నేటి తరం

సొంతంగా ఆలోచనలు

 లేని జనం.

చరవాణి పెత్తనం

 నేడు

 నడిపించే గుడ్డి దీపం

*****************

వెల్మజాల నర్సింహ✍🏻

రక్తదానం మహా దానం




డబ్బుంటే దాచుకో 

విద్యా వుంటే పంచుకో

కానీ రక్త దానం తెలుసుకో

రక్తదానం మహా దానం

మరో మనిషికి ప్రాణాదానం

నీలో ఊటబావి అది, నిత్యం

ప్రవాహిస్తునే వుంది

ఎదలో శుభ్రత ఎక్కడికో

పరుగులు


ధమనులు కార్మికులు 

సిరలు మన ఉద్యోగులు

సెలవులే వుండావు ,వారి

జీతం లో కోతలే లేవు

ఎర్ర రక్త కణాలు మన

బలమైన సైనికులు

ఆకు కూరలు అవీ మనఆరోగ్యం 

పెంచునులే

ఖర్జూర బాదం మన కోసం

శక్తి నిచ్చేవి లే

నడక వ్యాయామం 

రక్త ప్రసరణ మన చేతుల్లో

రక్త దానం చేస్తే నరాల

 సత్తా పెరుగును లే

రక్త హీనత రాకుండా

 కోత్త సత్తువ జేరునులే

క్యాన్సర్ కు కాళ్ళేం వేసి

కంచే దాటుకుండా చేయునులే

రక్త దానం చేసేదాం మన

 ఆరోగ్యాన్ని కాపాడుదాం

అత్యవసర  పరిస్థితులలో

నలుగురి ప్రాణాలు కాపాడేదాం

*****************

వెల్మజాల నర్సింహ.20.3.22

మనతో మది* !


అంతిమయాత్రకు ప్లాన్ ఏది

నీ ఆలోచనలకు ముగింపేది

నరక యాతన కి గెలుపేది


తినడానికి మనకు టైం ఏది

మాట్లాడే మాటలకు విలువేది

సోల్లుమాటాల కట్టాడికి ముల్లె ది

అణాగారిన ప్రజలకు దిక్కేది

మనిషి జీవితంలో సుఖమేది

*****************

వెల్మజాల నర్సింహ✍🏻

సప్త ధాతువులు .Sapta dhātuvulu

1. కాలమే అంతిమ ఆటను మార్చేది కాబట్టి జీవితంలో ఎప్పుడూ అహంకారంతో ఉండకండి

2. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి మనం ప్రతి అనుభూతిని ఉన్నంత వరకు ఆస్వాదించాలి. *అలాగే, జీవితం ఎప్పుడూ న్యాయమైనది కాదు, అది ఎప్పటికీ ఉండదు, కాబట్టి మీరు బలంగా *ఉండాలి

3. జీవితం అనేది కోరికల వల్ల కలిగే బాధ.

4. ప్రేమలో పడటం విధి, కానీ మీరు ఒకరి కోసం ఎలా నిరీక్షిస్తున్నారు అనేది మీరు అతన్ని/ఆమెను *ఎంతగా ప్రేమిస్తున్నారో నిర్వచిస్తుంది .

5. సూర్యుడు కూడా ఒంటరిగా ఉన్నాడు, కానీ ఇప్పటికీ ప్రకాశిస్తున్నాడు 

6. అంతా ముగుస్తుంది. యవ్వనం, ప్రేమ, జీవితం, అన్ని ముగింపులు, మరియు  అదే వాటిని *విలువైనదిగా చేస్తుంది .

7. మీరు వ్యక్తులను తేలికగా తీసుకుంటే, వారు మీ జీవితం నుండి దూరం కావచ్చు

****

వెల్మజాల నర్సింహ🖋️

అమాయక ఆలుగడ్డ InnocentPotato

 

కోసుకుంటే  కూరలో 

కాకుంటే సమెాసా లో 

పాపం నిన్ను పావ్ బాజీ తో 

పిసికితే పానీపుారి తో 

ఎలాగైనా లాగించేస్తూ

ఉత్తర భారత దేశంలో 

ప్రతి వంటలో నువ్వే 

పరోటా గా కడుపు నింపుతుా

వేపుడు వేస్తే కరకరలాడుతు 

చిప్స్ ల రూపంలో ఒదుగుతావు

సగం వంటలు నీతోనే 

వంకాయ తో ఒకటై పోయి

ఎన్నో కార్యలు నిలబెడుతావు

 ముంబయి వాసులకు  

వడపావ్ లో వడాగా

చేరి 

ఆకలి తీరుస్తు 

బతుకునిస్తున్నావు

సులభంగా వండే

 వంటలు నీవే 

పేద కడుపులు నింపే 

ఆహారం నీతోనే 

అమాయక ఆలుగడ్డ 

నీవు లేనిదే గడువదు మా అడ్డా

****************

 వెల్మజాల నర్సింహ.27.01.22

అక్షర అక్షయపాత్ర

నా అక్షరం నడిచే నిప్పు కణికలై* 

లక్ష మెదడులో విజ్ఞానం వెలిగించాలి* 

అనాదిగా వస్తున్న ఆచారాలను

 పాతాళానికి తొక్కేయాలి* 

మీ చదవులను మీ పాలనను

 నా అక్షరం ముందుకు నడిపించాలి* 

అంబేడ్కర్ అంటే మనిషి కాదు 

అందరినీ  నడిపించే అక్షర నౌకావుతాను* 

నిత్యం వెలుగులు పంచే* 

అక్షర అక్షయపాత్ర అవుతాను


వెల్మజాల నర్సింహ. 26.01.22

చిన్న చిన్న పల్లెలు


చిన్న చిన్న పల్లెలు 

పల్లెలలో పిల్లలు 

పిల్లలతో తల్లులు

తల్లిదండ్రులే దేవుళ్ళు 

దేవుళ్ళలా పల్లె మనుషులు


చిన్న చిన్న పల్లెలు

పల్లెలను కలిపే దారులు 

దారుల వెంట నీడలు

నీడలో నిలిచే ఆవులు 

ఆవుల వెంట దుాడలు

దుాడల వెనుక రాముడు 

చిన్న చిన్న పల్లెలు 

పల్లెలలో పండుగలు 

పండుగ తో  సందడి 

సందడిగా మాపందిరి 

చిన్న చిన్న  పల్లెలు 

పల్లెలలో పచ్చని పైరులు

పైరులలో తిరిగే రైతులు 

రైతు మనసు వెన్నెల

************


వెల్మజాల నర్సింహ* 🖋️

రాసేదేదో రాసేయ్

రాసేదేదో రాసేయ్

 నెటింట్లో లేదా వంటిట్లో
 కవిలా ఒక కవితా 
 రాయి గురించో లేదా రవి గురించో
 ఆలోచనలకు అడ్డు పడకు 
 తోచిందేదో తోసేయ్
 అర్థం కాకుంటే వారి ఖర్మ!
 కథలో రాజకుమారి
 కవితా లో కుక్క పిల్ల
 పొరుగింటి పడుచుపిల్ల
 ఏదైనా కథా వస్తువే 
 అమ్మ ప్రేమతో లాలి పాట
 గోళీలాట కాడ గోల గోల
 తాత అరుపులు 
 ఆకాశం లో మెరుపులు
 రాసేదేదో రాసేయ్ 
 నవ్వే వాళ్లు నవ్వుతారు
 నవ్వని వాళ్లు తల పట్టుకుంటారు 
 బుర్రలో తలంపుకు
 బుడి బుడి గా అడుగులు వేయించి
 తరాల మీవారి కోసం
 అక్షరబద్ధం ఇప్పుడే చెసేయ్
 రాసేదేదో రాసేయ్ 


 వెల్మజాల నర్సింహ. 26.12.21

సరదాకే

కాళ్ళకు అడ్డు వచ్చే పిల్లి
 బయటకు పోయే దాని తల్లి 
 తుమ్ముతు వచ్చే మా చెల్లి 
 సందులో జరిగే లోల్లీ 
 గోడకు నక్కినా బల్లి 
 కావేవి చెడ్డు శకునాలు
 బుద్ధితో ఆలోచిస్తూ 
 సాగు ముందుకు మళ్లీ మళ్ళీ


యంగ్ లుక్ పోయే యవ్వనం 
పోయే బట్టతల వచ్చే నెత్తి నెరెసే
 బాన పొట్ట వచ్చే కాళ్ళు గుంజే 
 బుద్ధి మారదాయే గుండు మల్లేశ !

జై భీమ్ -నేటి యువత చుాడవలిసిన చిత్రం

 

 

 

 

 

 

 

ఇప్పుడు మనకీ కావలసింది మహర్షి,

 వకీల్ సాబ్ కాదు జై భీమ్ లాంటి 

సినిమాలు కావాలి కానీ అలాంటి సినిమాలు 

తీసే ధైర్యం వున్న దర్శకుడు నటించే నటులు లేరూ

 . గాలిలో సుమెాలు ఎగరడం హీరో విజిల్ కు 

బట్టలు లేవడం. తోడ కొట్టడాలు 

ఇవే మన సినిమాలు. కానీ జై భీమ్ చూస్తే తెలుస్తుంది 

జీవిత సంఘర్షణ ఎట్లా వుంటుందని సామాన్య మానవుడికి

 చదువుకున్న వాడు చేసే మెాసాలు పోలీసులు చదువులేని 

వారిని ఏవిధంగా వాడుకుంటారు. చట్టం వారికి చుట్టంలాగ 

మలుచుకోన్ని చేసే అరాచకాలు అంతా ఇంతా కాదు

 ఇప్పటికీ మాములు పల్లెలలో జరిగే పెద్దల అరాచకాలు కొలోలలు

 కుల రాజకీయాలు కొంతైతే మత రాజకీయాలు కొన్ని పల్లెలను 

సర్వ నాశనం చేశాయి. కుల పెద్దల అరాచకాల వలన నలిగిపోయిన

 నిమ్న జాతి ఆడపడుచులేందరో అంబేడ్కర్ లాంటి వారు చదవటానికి

 పడిన కష్టం చూస్తే ఎవరిదైనా మనసు కలిచి వేసుంది. ఏది ఏమైనా 

సమాజంలో నిమ్న జాతి పై జరిగే అరాచకాలు వెలుగులోకి రావడానికి 

తనవంతుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జై భీమ్ లాంటి మరెన్

నో సామాజిక అంశం వున్న సినిమాలు వస్తాయని వాటికీ 

ఈ సినిమాయే ప్రేరణ. యువత ఆలోచనలకు బీజం వేసే జై భీమ్

 

! వెల్మజాల నర్సింహ

ఏది నిజం?*

 ఒక సంఘటన ఎప్పుడూ నుారు శాతం నిజం కాదు

 ముాడు రకాల ధోరణిలో వుంటుంది మెుదటిది

 :జరిగింది ఒకలాగా వుంటే రెండవది: 

నీకూ చెప్పేవారు కొంత జోడిస్తారు 

 ముాడవది:నీవు దానికి కొంత ఊహిస్తావు.

 **************

 వెల్మజాల నర్సింహ✍🏻

చీకటి వెంటాడుతోంది -The darkness is haunting

ఆకాశంలో మబ్బులు

 దారంతా రాళ్ళు రాప్పలు

 చేరాలి ఇంటికి 

చెప్పులే మెాయాలి నాబరువు 

 గుండెలో భయం కడుపులో 

ఎలుకల కయ్యాం

 నన్ను చీకటి వెంటాడుతోంది 

 **************

  వెల్మజాల నర్సింహ 15.10.21

విజయదశమి

దసరా అనగానే గడిచినా తొమ్మిది రోజులు

 సరే కాని పదవ రోజు నీ జీవిత మలుపు కావాలి

 అవే పది నిర్ణయాలు ఐదు చెడ్డ అలవాట్లు మనుకో 

ఐదు మంచి అలవాట్ల ప్రణాళిక రచించుకొ పెద్ద నిర్ణయాలు 

కాకుండా మాములే అయుండొచ్చు ఒక పేపర్ పై రాసి ఎక్కడో దాచు

 జీవితంలో ఏది వచ్చిన స్వాగతించు ఎందుకంటే అది ఒక గమ్యం

 తెలియని ప్రయాణం మన కష్టార్జితం పై మన రోడ్డు వుంటుంది

 గతుకుల లేదా ముళ్ల కంపా! అందమైన సి. సి రోడ్డ నీ మీదే ఆధారపడుతుంది

 . పయనం నీది గమ్యం నీది మధ్యలో వచ్చిన వారు మధ్యలో పోతారు 

 చివరి వరకు ఏలా వెళుతావొ నీ ఇష్టం దారి చుాపడం సమాజం పని బారం

 దేవుడి పై వేసి ముందకు సాగడమే వెనుకకు చూస్తే ముందుకు సాగలేవు 

 నీ చుాపు ఎప్పుడూ ఇప్పటి నుండి ముందుకే సమయం అందరికీ సమానం 

కాని సమాజంలో కొందరే చరిత్రలో నిలిచిపోతారు ఆలోచించి అడుగు

 వేస్తావు కాదు వెలుతురు లాంటి అక్షరం ఇస్తున్నా ఆయుధంగా 

మార్చుకుంటావో నీ ఇష్టం

 

 

 వెల్మజాల నర్సింహ. 15.10.21

మంచి ఎక్కడున్నా

మంచి ఎక్కడున్నా 

గ్రహించడం లో తప్పులేదు

 ఎందుకంటే 

అదే జీవితానికి 

సరిపడా కిక్కు.

 ***************

  వెల్మజాల నర్సింహ✍🏻*

చిన్ననాటి చిత్రాల వానా


బడిగంట 

మ్రోగిన వేళా 

బస్తా సంచి భుజానికేసి 

మాసిపోయిన జేబులలాగే 

మురిసిపోతి 

సద్దిపిండి తో 

ఎల్లిగాడు మల్లీగాడు 

వెంటరాగ నడిచే బాటలో 

చిన్ననాటి చిత్రాల వానా 

కురిసేనామ్మ 

మా ఎదలపైనా 

ముాలసందే గొడుగు కాదా 

నిల్చున్న చోటే 

మట్టిరోడ్డే వాగుకాదా 

పారుతున్న  నీరే 

పేపర్ పడవలు తేలియాడే

 కండ్లముందే

కట్టుకున్న బొమ్మరిల్లే 

కులీపోయే చినుకు వల్ల


చెట్టుకొమ్మ ఊగుతుండే 

గాలి వల్ల

పిల్లలంతా చేరే రోడ్డు పైనా 

కేరింతల సంతలా సాగేనంట

నేడు ఆటలాడు పోరలేరి

 వారికిచ్చే సమయమేది

*******************

 *వెల్మజాల నర్సింహ✍🏻