బడిగంట
మ్రోగిన వేళా
బస్తా సంచి భుజానికేసి
మాసిపోయిన జేబులలాగే
మురిసిపోతి
సద్దిపిండి తో
ఎల్లిగాడు మల్లీగాడు
వెంటరాగ నడిచే బాటలో
చిన్ననాటి చిత్రాల వానా
కురిసేనామ్మ
మా ఎదలపైనా
ముాలసందే గొడుగు కాదా
నిల్చున్న చోటే
మట్టిరోడ్డే వాగుకాదా
పారుతున్న నీరే
పేపర్ పడవలు తేలియాడే
కండ్లముందే
కట్టుకున్న బొమ్మరిల్లే
కులీపోయే చినుకు వల్ల
చెట్టుకొమ్మ ఊగుతుండే
గాలి వల్ల
పిల్లలంతా చేరే రోడ్డు పైనా
కేరింతల సంతలా సాగేనంట
నేడు ఆటలాడు పోరలేరి
వారికిచ్చే సమయమేది
*******************
*వెల్మజాల నర్సింహ✍🏻
No comments:
Post a Comment