కుంటేనక బావి
అది నాగరికత మెుదలై మనుషులు వ్యవసాయం  చేయడానికి అలవాటు పడుతున్న రోజులు మెాట్ట బావిలకు ఎడ్లతో 

నీరుతోడి వరి పండిస్తున్నారు.


దొరలు వరద నీరు కోసం చిన్న కుంటలు తవ్వ నీటిని నిల్వ చేయడం 

ప్రారంభించారు. 


రెండు కుంటలు తవ్వి

వాటికింద వ్యవసాయం

కోసం బావి తవ్వరు


చుట్టూ తాటి వనం మధ్యలో బావి ఊరికి దగ్గరగా వుండి 

బతుకమ్మ నిమజ్జనం కోసం వాడేవారు. 

,

దొరలు, పటేల్ లు మాములు జాతి వారిని చులకనగా చుాడడమే కాదూ వారిని జీతాలకు వుంచుకొని గొడ్డుచాకిరి చేపించు కున్నేవారు


అసురయ్య మల్లమ్మకు ఒక్కడే సంతానం పైగా తన అయ్యా కాలం చేసేనాటికి రెండు సంవత్సరాల పిల్లాడు .


మల్లమ్మ పటేల్ దగ్గర కళ్ళం పనులు చేస్తూ 


పరిగ గింజలు ఏరుకుని అసురయ్యను సాకింది. కొంచెం పెద్దవాడైనా  అసురయ్యను వాళ్లమ్మ 

పటేల్ దగ్గర కుంచం గింజలకు జీతంకు పెట్టింది. 


కుంటేనక బావి చుట్టూ 

పశువులను మేపడం పని 


పశువుల గుంపు దొడ్డి నుండి ఫకీరు చింత వరకు వుంటే దానికి ముందుగా గంగమ్మ ఆవు దారి నడిచేది 


గంగమ్మ ఆవు స్వచ్ఛమైన పాలనిచ్చేది 

దాని దుాడే రాముడు 

మన అసురయ్యకు మంచి కాలక్షేపము. పగటిపూట రాముడు పాలుత్రాగుతుంటే నేలపై రాలిన నురగలు అసురయ్య తీసుకోని 

తినేవాడు. 


చద్దన్నం అవసరం రాలేదు గంగా వలన


 కాలం ఒకచోట నిలువదు కొన్ని సందర్భాలలో మన ఆలోచనల కంటే ఎప్పుడూ ముందుటుంది అసురయ్య పెరిగి పెద్ద వాడైనాడు.


పటేల్ చివరి సంతానం కూతురు పుార్ణమ్మ 


పుత్తడిబొమ్మ బీరకాయ పువ్వుల నిగనిగలాడుతుండేది.


కుంట వెనుక బావి కాడికి 

పటేల్ తో వచ్చేది. 


ప్రకృతి అందాలను చుాసి చాలా మురిసిపోయేది.


అక్కడే పశువులకాడ వున్న అసురయ్య పుార్ణమ్మకు రేగు పళ్లు, గేగులు మరియు సీతాఫలాలు తెచ్చి ఇచ్చేవాడు. 


అలా కొన్ని సంవత్సరాలు గడిచినా తరువాత అ బావికి వారిద్దరికి విడదియ రాని 

బంధం ఏర్పడినది. 


పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో  వయసున్న వారిద్దరూ శారీరకంగా చాలా సార్లు కలుసుకున్నారు. 


పుార్ణమ్మ గర్భం దాల్చింది. పుార్ణమ్మ బావి కాడికి రావడం లేదూ 


అసురయ్య గుండెలో భయం మెుదలైయుంది. 


పటేల్ అసురయ్యను 

జీతం నుండి తీసేసాడు 


కొన్ని రోజుల తరువాత 

పుార్ణమ్మకు హైదరాబాదు 

దొరగారి తో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. 


కానీ అసురయ్య పెండ్లి 

వద్దు ఈ జీవితం 

అ దొరసానికే అంకితం 


అంటాడు. 


కుంటేనక బావే మమ్ముల్ని మళ్ళీ కలుపుతాదాని రోజు 

ఉదయం అక్కడి పోయి వస్తాడు. 


 ప్రేమానేది ఎవరిని ఎప్పుడూ ఎలా కలుపుతుందో తెలియదు వెల్మజాల నర్సింహ 

దుప్పెల్లి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి