ఒక సంఘటన ఎప్పుడూ నుారు శాతం నిజం కాదు
ముాడు రకాల ధోరణిలో వుంటుంది మెుదటిది
:జరిగింది ఒకలాగా వుంటే రెండవది:
నీకూ చెప్పేవారు కొంత జోడిస్తారు
ముాడవది:నీవు దానికి కొంత ఊహిస్తావు.
**************
వెల్మజాల నర్సింహ✍🏻
జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం.. గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే
ఒక సంఘటన ఎప్పుడూ నుారు శాతం నిజం కాదు
ముాడు రకాల ధోరణిలో వుంటుంది మెుదటిది
:జరిగింది ఒకలాగా వుంటే రెండవది:
నీకూ చెప్పేవారు కొంత జోడిస్తారు
ముాడవది:నీవు దానికి కొంత ఊహిస్తావు.
**************
వెల్మజాల నర్సింహ✍🏻
ఆకాశంలో మబ్బులు
దారంతా రాళ్ళు రాప్పలు
చేరాలి ఇంటికి
చెప్పులే మెాయాలి నాబరువు
గుండెలో భయం కడుపులో
ఎలుకల కయ్యాం
నన్ను చీకటి వెంటాడుతోంది
**************
వెల్మజాల నర్సింహ 15.10.21
దసరా అనగానే గడిచినా తొమ్మిది రోజులు
సరే కాని పదవ రోజు నీ జీవిత మలుపు కావాలి
అవే పది నిర్ణయాలు ఐదు చెడ్డ అలవాట్లు మనుకో
ఐదు మంచి అలవాట్ల ప్రణాళిక రచించుకొ పెద్ద నిర్ణయాలు
కాకుండా మాములే అయుండొచ్చు ఒక పేపర్ పై రాసి ఎక్కడో దాచు
జీవితంలో ఏది వచ్చిన స్వాగతించు ఎందుకంటే అది ఒక గమ్యం
తెలియని ప్రయాణం మన కష్టార్జితం పై మన రోడ్డు వుంటుంది
గతుకుల లేదా ముళ్ల కంపా! అందమైన సి. సి రోడ్డ నీ మీదే ఆధారపడుతుంది
. పయనం నీది గమ్యం నీది మధ్యలో వచ్చిన వారు మధ్యలో పోతారు
చివరి వరకు ఏలా వెళుతావొ నీ ఇష్టం దారి చుాపడం సమాజం పని బారం
దేవుడి పై వేసి ముందకు సాగడమే వెనుకకు చూస్తే ముందుకు సాగలేవు
నీ చుాపు ఎప్పుడూ ఇప్పటి నుండి ముందుకే సమయం అందరికీ సమానం
కాని సమాజంలో కొందరే చరిత్రలో నిలిచిపోతారు ఆలోచించి అడుగు
వేస్తావు కాదు వెలుతురు లాంటి అక్షరం ఇస్తున్నా ఆయుధంగా
మార్చుకుంటావో నీ ఇష్టం
వెల్మజాల నర్సింహ. 15.10.21
మంచి ఎక్కడున్నా
గ్రహించడం లో తప్పులేదు
ఎందుకంటే
అదే జీవితానికి
సరిపడా కిక్కు.
***************
వెల్మజాల నర్సింహ✍🏻*
బడిగంట
మ్రోగిన వేళా
బస్తా సంచి భుజానికేసి
మాసిపోయిన జేబులలాగే
మురిసిపోతి
సద్దిపిండి తో
ఎల్లిగాడు మల్లీగాడు
వెంటరాగ నడిచే బాటలో
చిన్ననాటి చిత్రాల వానా
కురిసేనామ్మ
మా ఎదలపైనా
ముాలసందే గొడుగు కాదా
నిల్చున్న చోటే
మట్టిరోడ్డే వాగుకాదా
పారుతున్న నీరే
పేపర్ పడవలు తేలియాడే
కండ్లముందే
కట్టుకున్న బొమ్మరిల్లే
కులీపోయే చినుకు వల్ల
చెట్టుకొమ్మ ఊగుతుండే
గాలి వల్ల
పిల్లలంతా చేరే రోడ్డు పైనా
కేరింతల సంతలా సాగేనంట
నేడు ఆటలాడు పోరలేరి
వారికిచ్చే సమయమేది
*******************
*వెల్మజాల నర్సింహ✍🏻
అది నాగరికత మెుదలై మనుషులు వ్యవసాయం చేయడానికి
అలవాటు పడుతున్న రోజులు మెాట్ట బావిలకు ఎడ్లతో
నీరుతోడి వరి పండిస్తున్నారు.
దొరలు వరద నీరు కోసం చిన్న కుంటలు తవ్వ నీటిని నిల్వ చేయడం
ప్రారంభించారు.
రెండు కుంటలు తవ్వి
వాటికింద వ్యవసాయం
కోసం బావి తవ్వరు
చుట్టూ తాటి వనం మధ్యలో బావి ఊరికి దగ్గరగా వుండి
బతుకమ్మ నిమజ్జనం కోసం వాడేవారు.
,దొరలు, పటేల్ లు మాములు జాతి వారిని చులకనగా
చుాడడమే కాదూ వారిని జీతాలకు వుంచుకొని గొడ్డుచాకిరి చేపించు కున్నేవారు
అసురయ్య మల్లమ్మకు ఒక్కడే సంతానం పైగా తన అయ్యా కాలం చేసేనాటికి రెండు సంవత్సరాల పిల్లాడు .
మల్లమ్మ పటేల్ దగ్గర కళ్ళం పనులు చేస్తూ
పరిగ గింజలు ఏరుకుని అసురయ్యను సాకింది.
కొంచెం పెద్దవాడైనా అసురయ్యను వాళ్లమ్మ
పటేల్ దగ్గర కుంచం గింజలకు జీతంకు పెట్టింది.
కుంటేనక బావి చుట్టూ
పశువులను మేపడం పని
పశువుల గుంపు దొడ్డి నుండి ఫకీరు చింత వరకు వుంటే
దానికి ముందుగా గంగమ్మ ఆవు దారి నడిచేది
గంగమ్మ ఆవు స్వచ్ఛమైన పాలనిచ్చేది
దాని దుాడే రాముడు
మన అసురయ్యకు మంచి కాలక్షేపము.
పగటిపూట రాముడు పాలుత్రాగుతుంటే నేలపై రాలిన
నురగలు అసురయ్య తీసుకోని
తినేవాడు.
చద్దన్నం అవసరం రాలేదు గంగా వలన
కాలం ఒకచోట నిలువదు కొన్ని సందర్భాలలో
మన ఆలోచనల కంటే ఎప్పుడూ ముందుటుంది
అసురయ్య పెరిగి పెద్ద వాడైనాడు.
పటేల్ చివరి సంతానం కూతురు పుార్ణమ్మ
పుత్తడిబొమ్మ బీరకాయ పువ్వుల నిగనిగలాడుతుండేది.
కుంట వెనుక బావి కాడికి
పటేల్ తో వచ్చేది.
ప్రకృతి అందాలను చుాసి చాలా మురిసిపోయేది.
అక్కడే పశువులకాడ వున్న అసురయ్య పుార్ణమ్మకు రేగు పళ్లు,
గేగులు మరియు సీతాఫలాలు తెచ్చి ఇచ్చేవాడు.
అలా కొన్ని సంవత్సరాలు గడిచినా తరువాత అ బావికి వారిద్దరికి విడదియ రాని
బంధం ఏర్పడినది.
పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో వయసున్న వారిద్దరూ శారీరకంగా చాలా సార్లు కలుసుకున్నారు.
పుార్ణమ్మ గర్భం దాల్చింది.
పుార్ణమ్మ బావి కాడికి రావడం లేదూ
అసురయ్య గుండెలో భయం మెుదలైయుంది.
పటేల్ అసురయ్యను
జీతం నుండి తీసేసాడు
కొన్ని రోజుల తరువాత
పుార్ణమ్మకు హైదరాబాదు
దొరగారి తో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.
కానీ అసురయ్య పెండ్లి
వద్దు ఈ జీవితం
అ దొరసానికే అంకితం
అంటాడు.
కుంటేనక బావే మమ్ముల్ని మళ్ళీ కలుపుతాదాని రోజు
ఉదయం అక్కడి పోయి వస్తాడు.
ప్రేమానేది ఎవరిని ఎప్పుడూ ఎలా కలుపుతుందో తెలియదు
**************
వెల్మజాల నర్సింహ
దుప్పెల్లి
ఆకాశంలో అలసిన చుక్కలు
మబ్బుల్ల
చాటున దాగిన వేళా
అలిగిన నీ మనసుకు
అంతా చీకటేనని చెప్పేసా
నాకనుపాపకు భయమేందుకాని
నీకనుసైగలు చెప్పగా
మేఘ సందేశ జవాబులు
కావవి
నా హృదయంలో
అలజడులే కదా
నీ కనుచూపుతో వేసిన
బాణం
కరవాలమై గుండెను పొడిచే
ఎద పొదలో నిండిన ప్రేమ
ఏక దాటిగ కలవర పెట్టే
రెప్పలు దాచిన నాకనులకు
నీ రుాపం వెలుతురు తెచ్చే
దేహంతో వచ్చిన దేవతగా
నాగుండెలో ముద్రితమైతివి
******************
*వెల్మజాల నర్సింహ* ✍🏻
आकाशात थकलेले थेंब
ढगाळ
वाड्यात लपताना
तुझ्या विकलेल्या मनाला
सर्व काही अंधार आहे म्हणा
मला पापाची भीती नाही
जेव्हा आपण डोळे मिचकावले
मेघा मेसेजची उत्तरे
जे आहेत
माझ्या अंत: करणात
ते अस्वस्थ आहेत का?
आपल्या डोळ्यांनी बनवले
बाण
हृदय पिळवटून टाकणारा
झुडूप मध्ये प्रेम
मोजण्यापलीकडे त्रासदायक
पापण्यांनी लपवलेल्या नखांना
तुमचा चेहरा प्रकाश आणतो
देवता म्हणून अवतार
माझ्या हृदयावर अंकित
*वेलमाजला नरसिंह*
爱情信
పుార్వం దుప్పెల్లి అనే గ్రామంలో జంగయ్య అనే రైతు వుండేవాడు.
తనకున్న కొద్ది పొలంలో
పంటలను పండిస్తుా నలుగురితో కలిసి మెలసి
ఆనందంగా జీవనం సాగిస్తున్నాడు.
ఒక రోజు సాయంత్రం పుాట పచ్చని చేనులో
పనులు చేస్తుండగా
పైనుండి వెళుతున్నా దేవుడికి పచ్చగా
వున్న చేను చుాసి ముచ్చటేసింది.
మారు వేషధారణ తో
కిందకి వచ్చి రైతుతో
కాసేపు మాట్లాడుతానని
వచ్చాడు.
రైతుతో మాటల్లో మాట కలుపుతూ పంట పండించడం
చాలా సులభం భుామాత దయ పంటలు పండుతాయి అన్నాడు.
దానికి రైతు చుాడు పెద్ద మనిషి మాటల వలన ప్రయోజనం లేదు.
వ్యవసాయం ఆషామాషీ కాదూ మీకు సులభం
అనిపిస్తే పండించి చుాపించండి అన్నాడు రైతు.
దానికి దేవుడు అలాగే అన్నాడు.
రైతుని ఓడించా నడుము కట్టాడు దేవుడు
వారిద్దరూ కలిసి వ్యవసాయం చేయడానికి పూనుకున్నారు.
దేవుడు రైతుకు కొన్ని షరతులు పెట్టాడు.
మొదటి షరతు.
మొదటి పంటలో పైకి కాసిన ధ్యానం మొత్తం
నాదే అన్నాడు దేవుడు
దానికి రైతు సరే అన్నాడు.
వాళ్లు ఇద్దరు మెుదటి పంటగా వేరుశనగ వేశారు
పంట ఏపుగా పెరిగింది దేవుడి ఆనందానికి అవధులేవు.
మనసులో దేవుడు అనుకుంటున్నాడు రైతు ఎంత పిచ్చొడు
పై పంట నాకే అంటే ఒప్పుకున్నాడని .
కొన్ని రోజుల తరువాత పంట చేతి కొచ్చింది
షరతు ప్రకారం కింద కాసిన కాయలు రైతు తీసుకున్నాడు.
దేవుడికి ఏమి మిగలలేదు.
దేవుడు రైతుతో మళ్ళీ వ్యవసాయం చేద్దాం అన్నాడు.
కానీ ఈసారి కింద కాసిన పంట నాదే అనీ షరతు పెట్టాడు.
దానికి రైతు సరే అన్నాడు.
వర్షకాలం కావడంతో రైతు ఈసారి వరి వేశాడు
పంట పచ్చగా ఏపుగా పెరిగింది దేవుడి ఆనందంగా వున్నాడు
నేనూ చాలా తెలివైన వాడినని.
పంట చేతి కొచ్చింది షరతు ప్రకారం పైకి
వచ్చిన ధ్యానం రైతు తీసుకున్నాడు.
దేవుడికి గడ్డి మిగిలింది.
రైతును ఓడించడం ఎలా
అనుకోని రైతు దగ్గరకు పోయి మనం మళ్లీ వ్యవసాయం చేద్దాం
కానీ నా చివరి షరతు
పంట కింద మీద వచ్చే పంట నాకే అన్నాడు
దానికి రైతు సరే అన్నాడు.
వరి కోసిన భూమిలో
ఈసారి రైతు మెుక్క జొన్న వేశాడు
పంట పచ్చగా నిగనిగలాడుతుంది.
దేవుడు సంతోషంగా వున్నాడు.
మనసులో అనుకుంటుండు రైతు వట్టి అమాయకుడు
పండిన పంటలో కింద పైన వచ్చే పంట నాకు ఇచ్చి
ఎట్లా గెలుస్తాడు అనుకున్నాడు.
అలా కొన్ని రోజులు గడిచినా తరువాత పంట చేతికి వచ్చింది.
షరతు ప్రకారం మధ్యలో కాసిన కాంకులను రైతు కొసుకున్నాడు
దేవుడికి చివరకు గడ్డే మిగిలింది
అప్పుడు అర్థం అయింది
రైతును ఓడించడం అంతా సులభం కాదని
దేశానికి అన్నం పెట్టే రైతు నా కన్నా గొప్పోడు అనుకున్నాడు
అక్కడి నుండి జరుకున్నాడు
శ్రమను నమ్ముకున్న వారికి విజయం ఎప్పటికైనా వరిస్తుంది
***************
వెల్మజాల నర్సింహ. 20.6.21
నిజం ఎప్పుడూ నగ్నమే
మనమే దానికి అబద్దమనే తొడుగులను
జత చేస్తాం
Truth is always naked
We are the liars of it
Let's add
గింజకు ప్రాణాలంట మొలకెత్తడానికి
వానామ్మకు చిరునామా ఎందుకు
చిరుజల్లులు కురవడానికి
నేటి సమాజంలో
స్మార్ట్ ఫోన్ వున్న ప్రతివాడు
గొర్రెల తయారయ్యాడు వచ్చిన
ప్రతి మెసేజ్ ఫార్వర్డ్ చేయటమే.
.జీవితంలో నిన్ను నీవు నమ్ముకుంటే
అ విజయానికి తొలి మెట్టు
న్నింటికీ మాత్రమే వుంటుంది.
పుట్టిన ఊరు కన్న తల్లితో సమానం
కొన్ని గ్రామాలు కట్టడాల వలన ఫేమస్ అవుతాయి.
అలా దుప్పెల్లి గ్రామంలో వున్న జేతలబావి(జలతార బావి) గురించి చెప్పాలంటే
జలం అనగా నీరు
తార అనగా నక్షత్రాలు
స్వచ్చమైన నీటితో రాత్రిలో నక్షత్రాలు స్పష్టంగా కనిపించే విధంగా వుండేవి.
అలాగే రాత్రి వేళలో దేవ కన్యాలు వచ్చి స్నానాలు
చేసేవారేమెు శబ్ధాలు వచ్చేవి అని అక్కడ పని చేసిన పెద్దలు అంటుంటారు. ..
బావి గురించి చెప్పాలంటే కాకతీయుల
చివరి రాజు ప్రతాప రుద్రడి కాలంలో తవ్వ
బడిన స్థానిక దొర గారిది
అప్పటి కాలం సువర్ణ యుగామని చెప్పవచ్చు ఎందుకంటే
తిన్న డానికి సరైన ఆహారం లేకున్నా
వ్యవసాయ క్షేత్రాలలో దొరికే పండ్లు కాయలతో
హాయిగా జీవించేవారు.
దొరగారు ఎంతో ఇష్టంగా తవ్వించి చుట్టూ బండాలపై దేవతా ప్రతిమలను వేయించారు.
నీరు చాలా తీయగా వుండి వ్యవసాయానికి వాడేవారు.
చుట్టూ ప్రక్కల రావి మరియు పెద్ద ఊడలమర్రి చెట్టు వుండేది.
ఇరవై ముప్ఫై మంది జీతాగాండ్ల తో నిత్యం
కళకళలాడుతుండేది.
ప్రక్కనే పెద్ద పశువుల దొడ్డి తో సంతల రద్దీగా వుండేది.
కానీ నేడు దొరలు లేరు బావులా శోభలేదు
మా చిన్నతనంలో అని చెపే తాతయ్య తప్ప
*వెల్మజాల నర్సింహ*26.5.21
సృష్టిలో తీయనైనది
సృష్టికే ముాలమైనది
యవ్వనంలో పరుగులైనది
యద లో పొంగే ప్రేమైనది
క్షణ కాలం బొంగారమైనది
క్షణమీడని జీవన మైనది
రతి సతి తో ఐక్యమైనది
లోకమంతా మైకమైనది
కామం గెలిచితే వీరుడనది
ప్రపంచ శాంతికి
మార్గ మనది
కామం కాదు లోకమనేది
యవత తెలుసుకుంటే భవితనది
బతుకులు బత్తాయి బతుకులు
బతుకులు బతుకుతున్నామనే
సందేహం లో బతుకులు
బతుకులు మనవాళ్లు
వున్నారని భ్రమలో బతుకులు
బతుకులు చచ్చేదాక
సంపాదన ధ్యేయం బతుకులు
బతుకులు ఏవరి కోసం,
ఎందుకో బతుకులు
బతుకులు పుట్టామా
గిట్టామా బతుకులు
బతుకులు భుక్తి కోసం
పోరాట బ్రతకులు
బతుకులు భుామికోసం
బతకులు
బతుకులు భయం
భయం బతుకులు
కానీ సంతృప్తి చెందిన
బతుకే బతుకు కదా
మీరు రాసింది మా తలరాతంట
ప్రపంచ మేధావి మీరంట
మీరాతలే గీతాగ నేడంట
అక్షరమే ఆయుధం నీదంట
అన్ని వర్గాలకు మేలంట
దీపం వెలుగులో చదువంట
అణగారిన జాతికే వెలుగంట
*********************
వెల్మజాల నర్సింహ 🙏🏻
వసంతాగమనం వచ్చింది
ఉగాది పండగ తెచ్చింది
చైత్ర మాసంలో వచ్చింది
చెట్టుకొమ్మ చిగురించింది
కాలగమనం మెుదలైంది
కోయిలమ్మ గొంతు విపింది
కొత్త సంవత్సరం వచ్చింది
యుగాదిపండుగ తెచ్చింది
కవులు కలాలు పట్టారు
కవిత్వం తో స్వాగతించారు
మామిడి కాయల సందడి
వేప పువ్వుల పందిరి
తీపి వగరు చేదు పులుపు
ఉగాది పచ్చడి చేయండి
ఊరంత పంచండి
పంచాంగాని వినండి
పరిపూర్ణంగా జీవించండి
******************
(వెల్మజాల నర్సింహ చరవాణి.9867839147)
చుట్టూ పచ్చని పంట పొలాలు.
వాటి మధ్య లో పిల్లకాలువలు
పైన చెరువు పచ్చని చీర
కట్టిన బాపు బొమ్మల వుంటుంది దుప్పల్లి
మా ఊరు.
ఐదవ తరగతిలో అనుకుంటా ప్రారంభం
ఉదయం వేకువ జామున లేచి పుస్తకం
చదువు కుంటు
పొలం కాడికి పోయి ్య
ఆవు పాలు పిండుకొన్ని
రావడం
సాయంత్రం నాలుగు
గంటలకు మళ్లీ పోవడం
నాన్నకు పొలం పనులో
సహాయం చేసి
నాన్నతో కబుర్లు కథలు చెపుతుంటే వింటూ
రావడం జరిగేది.
అప్పుడు పొలం పనులు
చేయడం వలన బాడీ
చాలా దృడంగా మారింది
పంట పొలాలు మధ్య
తిరగటం
పచ్చివి పెసర మరియు
వేరు సెనగ కాయలు
తినడం సీతాఫలాలు
రోజు వారి ఆహారమే అక్కడ.
వరి వరం పై పిల్లి పెసరు కాయలు
రామయ్య తాత జొన్న
కాంకులు .
పాలు కారే కాంకుల లో
పలుగు రాళ్ళు వేడి చేసి
వేస్తే వచ్చే రుచి బాగుండేది.
బాట వెంబడి కంది కాయలు
వేసవిలో తాటి ముంజలు
తింటూ జీవితం గడిచేది
దారి లో ఎవరైనా
మనుషులు కనబడితే
బంధువుల వలే
మనసు విప్పి మాట్లాడుకునే వారు
మా నాన్న అంటుండేవాడు
దారి ఎంత దుారం వున్న
గమ్యం గురించే ఆలోచి స్తాము అలాగే
ప్రస్తుతం చేస్తున్నా పనిపై
ఏకాగ్రత పెడితే విజయం తప్పకుండా వరిస్తుందాని.
ఒక రోజు సాయంత్రం
ఉరుములతో కుాడిన వర్షం
ఎల్లమ్మ కాలువ లో వానాకు నీరు జోరుగా
ప్రవహిస్తుంది.
కట్టపై వేప చెట్టుపై గిజిగాడు చాలా అందంగా
అలినా గుాడు లో చిన్న పిల్లలు
చలికి వణుకుతున్నాయి
చాలా బాధనిపించింది
వెళ్లి నాన్నకు చెపితే
వాటిని తీసుకొచ్చి
వెచ్చని గోగునార సంచిపై వుంచిండు
ఉదయం భానుడి
కిరణాల వేడికి
అవి ఎగురుతు గూటికి
చేరడం చూస్తే చాలా ఆనందం వేసింది.
వాటి తల్లి పిల్లల ఆనందానికి. ..
అప్పుడు మనసులో
అనిపించిన మాట. ..
ఆశలకు మరణంలేదు
అవకాశలకు కొదువే లేదు
ఆనందానికి హద్దులు వేసి
అవరోధాలను దాటేద్దాం
పేదతనం ధైర్యనిస్తుంది.
మంచి సంస్కారాన్ని నిస్తుంది.
అనడం లో సందేహం లేదు
వెల్మజాల నర్సింహ
(అగ్ని శిఖ రచయిత)
మావిలో జీవం పోసుకొని
బయట ప్రపంచంలోకి
రావడానికి తన శక్తినంతా కుాడా గట్టుకొని మావి ప్
రపంచం నుండి మరో ప్రపంచం లోకి వచ్చిన జీవి
తన జీవిత పోరాటం ఆనందంతొ ప్రారంభించి
అబద్దాల జీవితానికి అలవాటు పడి మెాసపొతు
మెాసం చేస్తు
జీవితమంటే ఏమిటొ తెలుసుకోకుండా
ముగిస్తుంటాడు.
కొందరి జీవితాలు చాలా
ల విచిత్రంగా వుంటాయి
కొంతమందే ఇతరులకు చాలా ప్రేరణగా నిలుస్తారు
మానవ మెదడులు అందరివి దాదాపుగా ఒకే
నిర్మాణం. కానీ కొందరే చరిత్ర వీరులౌవుతారు.
చిన్నపుడు మా అమ్మ
ఒక మాట అంటుండేది
ఒక ఊరి లో దొర గారికి
పుత్రుడు జన్మించాడు
అక్కడే చెట్టు పై కాకి కూడా అదే రోజు
ఐదు పిల్లలకు పొదిగి జీవం పోసింది.
కాకి పిల్లల పెద్దవై ఎగిరి
పొాయ్యాయి
దొర కొడుకు పెద్ద వాడై
తన తాత ముత్తాతల
ఆస్తి అనుభవిస్తు
మరణించాడు
కాకి పిల్లలకు
దొర కొడుకు పెద్ద తేడా
లేదు పుట్టడం గిట్టడం .
ప్రకృతిలో సృష్టి ధర్మం,
కానీ మనిషిగా ఆలొచించే శక్తి వుండి
దైవమిచ్చిన నీ కళను గుర్తుంచుకోకుండ జీవించి
జీవిత చరమాంకంలో
బాధ పడితే
చేతులు కాల్చుకున తరువాత
ఆకుల పట్టుకుంటే ప్రయోజనం లేదు.
నిన్ను నీవు గుర్తుంచుకో
గౌరవించుకో .
సామాజిక స్పృహ,
ఇతరులకు సహాయం చేయడం, వున్న దానితో
ఆనందంగా గడపడం
ఇదే కదా జీవితం
*******************
వెల్మజాల నర్సింహ✍🏻
ఊటబావిలా ఉరిస్తావు
ఉహకందని నీరిస్తావు
కలలో నువ్వే కవ్విస్తావు
కనిపించక మురిపిస్తావు
మస్తిష్కంలొ కల్లోలం సృష్టిస్తావు
పదిమందిలో మెప్పిస్తావు
నలుగురిని నవ్విస్తావు
చదువుల బడినె
వలెస్తావు
పిల్లల కోసం తల్లి వౌతావు
తెలుగు కవుల సరిగమలౌవుతావు
కవిత్వమా కాసేపు కవ్వించుమా. .
రాగాలలో గానమౌతావు
రాసే యువకుల ప్రేమౌవుతావు
విరసం, సరసాలాలతొ
సాదిస్తావు
అవధానలతొ అలరిస్తావు
అష్ట దిగ్గజాలనే ఆటాడిస్తావు
కవిత్వమా కాసేపు లాలించుమా
బాధల లో నువ్వే కనిపిస్తావు
పోరాట వీరుల తొడుంటావు
వయసుతొ పని లేదంటావు
అక్షరమే ఆయుధమై
ప్రశ్నిస్తావు
కవిత్వమా నీతోనే
పోరాటం సాగించనా
*****************
మల్లన మల్లన
*************
పల్లవి:మల్లన మల్లన మల్లనో
మేము వేడుకునే దేవుడవు మల్లన
పచ్చని పల్లెలో మల్లన
నీవు స్వచ్చమైన దేవుడవు మల్లన
:మల్లన మల్లనో:
చరణం: పంట పొలాల మధ్య మల్లనో
నీకూ గుడి కట్టి కొలచు కుంటిమి మల్లన
గొడ్డు గొర్రె కాపాడమని మల్లన
మా గొడు నీకూ చెప్పుకుంటూమి మల్లన
:మల్లన మల్లనో:
చరణం: మీ కొర్రమీసం చుాసిమల్లన
మా పొరాగాళ్లు పెంచుతుండే మల్లన
నువ్వు అక్క కిచ్చే గౌరవంతొ మల్లన
మా అక్క చెల్ల లను చుాసు కుంటిమి మల్లన
:మల్లన మల్లనో:
చరణం: మా పల్లె సాలంగా చుాస్తావని మల్లన
మీకు పండుగ చేసి కొలచుకుంటాం మల్లన
మీ కమ్మనైనా కథ తోటి మల్లన
మా జీవితంలో అనుసరించితిమి మల్లన
మా పాపలు పొగొట్టామని మల్లన
నీకుా పట్నలేసి పండుగ జేసితిమి మల్లన
చరణం: మల్లన మల్లన
మల్లనో
మమ్ముల చలంగా చుాసేటి దేవుడవు మల్లన
మల్లన మల్లన మల్లనొ
నీకూ వెల వెల వందనాలు మల్లన (2)
****
వెల్మజాల నర్సింహ✍🏻