దేవుడిని ఓడించినా రైతు

 

పుార్వం దుప్పెల్లి అనే గ్రామంలో జంగయ్య అనే రైతు వుండేవాడు. 

తనకున్న కొద్ది పొలంలో 

పంటలను పండిస్తుా నలుగురితో కలిసి మెలసి 

ఆనందంగా జీవనం సాగిస్తున్నాడు.

ఒక రోజు సాయంత్రం పుాట పచ్చని చేనులో 

పనులు చేస్తుండగా 

పైనుండి వెళుతున్నా దేవుడికి పచ్చగా

 వున్న చేను చుాసి ముచ్చటేసింది. 


మారు వేషధారణ తో 

కిందకి వచ్చి రైతుతో 


కాసేపు మాట్లాడుతానని 

వచ్చాడు.


రైతుతో మాటల్లో మాట కలుపుతూ పంట పండించడం

 చాలా సులభం భుామాత దయ పంటలు పండుతాయి అన్నాడు.


దానికి రైతు చుాడు పెద్ద మనిషి మాటల వలన ప్రయోజనం లేదు. 


వ్యవసాయం ఆషామాషీ కాదూ మీకు సులభం

 అనిపిస్తే పండించి చుాపించండి అన్నాడు రైతు. 

దానికి దేవుడు అలాగే అన్నాడు. 

 రైతుని ఓడించా నడుము కట్టాడు దేవుడు 

వారిద్దరూ కలిసి వ్యవసాయం చేయడానికి పూనుకున్నారు.

దేవుడు రైతుకు కొన్ని షరతులు పెట్టాడు. 

 మొదటి షరతు. 


మొదటి పంటలో పైకి కాసిన  ధ్యానం మొత్తం 

నాదే అన్నాడు దేవుడు 


దానికి రైతు సరే అన్నాడు. 

వాళ్లు ఇద్దరు మెుదటి పంటగా వేరుశనగ వేశారు 

పంట ఏపుగా పెరిగింది దేవుడి ఆనందానికి అవధులేవు.

మనసులో దేవుడు అనుకుంటున్నాడు రైతు ఎంత పిచ్చొడు 

పై పంట నాకే అంటే ఒప్పుకున్నాడని .

కొన్ని రోజుల తరువాత పంట చేతి కొచ్చింది 

షరతు ప్రకారం కింద కాసిన కాయలు రైతు తీసుకున్నాడు. 

దేవుడికి ఏమి మిగలలేదు. 

దేవుడు రైతుతో మళ్ళీ వ్యవసాయం చేద్దాం అన్నాడు.

కానీ ఈసారి కింద కాసిన పంట నాదే అనీ షరతు పెట్టాడు. 

దానికి రైతు సరే అన్నాడు. 

వర్షకాలం కావడంతో రైతు ఈసారి వరి వేశాడు 

పంట పచ్చగా ఏపుగా పెరిగింది దేవుడి ఆనందంగా వున్నాడు 

నేనూ చాలా తెలివైన వాడినని. 

పంట చేతి కొచ్చింది షరతు ప్రకారం పైకి 

వచ్చిన ధ్యానం రైతు తీసుకున్నాడు. 

దేవుడికి గడ్డి మిగిలింది.

రైతును ఓడించడం ఎలా 

అనుకోని  రైతు దగ్గరకు పోయి  మనం  మళ్లీ వ్యవసాయం చేద్దాం 

కానీ నా చివరి షరతు  

పంట కింద మీద వచ్చే పంట నాకే అన్నాడు 

దానికి రైతు సరే అన్నాడు. 

వరి కోసిన భూమిలో 

ఈసారి రైతు మెుక్క జొన్న వేశాడు 

పంట పచ్చగా నిగనిగలాడుతుంది.


దేవుడు సంతోషంగా వున్నాడు. 


మనసులో అనుకుంటుండు రైతు వట్టి అమాయకుడు 

పండిన పంటలో కింద పైన వచ్చే పంట నాకు ఇచ్చి 

ఎట్లా గెలుస్తాడు అనుకున్నాడు. 

అలా కొన్ని రోజులు గడిచినా తరువాత పంట చేతికి వచ్చింది. 

షరతు ప్రకారం మధ్యలో కాసిన కాంకులను రైతు కొసుకున్నాడు 

దేవుడికి చివరకు గడ్డే  మిగిలింది

అప్పుడు అర్థం అయింది 

రైతును ఓడించడం అంతా సులభం కాదని 

దేశానికి అన్నం పెట్టే రైతు నా కన్నా గొప్పోడు అనుకున్నాడు 

అక్కడి నుండి జరుకున్నాడు 

  శ్రమను నమ్ముకున్న వారికి విజయం ఎప్పటికైనా వరిస్తుంది  

***************

వెల్మజాల నర్సింహ. 20.6.21

No comments:

Post a Comment