నీ హృదయం స్మశానంమైతే
నీ ఏద పై చదరంగ మేనొయ్
అగ్గి రవ్వల తలంపుతో
ఆనందం పొందాలేవొయ్
నీ మనసు నీండు కోవెలైతే
భక్తి మార్గం మెండుగానొయ్
కలియుగంలో మనుషులకు
కఫటానికి కొదవే లేదోయ్
మరణానికి భయపడితే
జీవనం ముందుకు సాగదోయ్
భయాలను విడితే బతుకు బంధం బలపడునొయ్
ఒడిపోవడం లో
అనుభవం గేలుపుకు దారులు తెరుచుకునొయ్
గమ్యనికి లెక్కల బదులుగా
అడుగేసి ముందుకు సాగవొయ్
గతాన్నికి గజ్జెలు కట్టి
ఆటడడం అవసరం లేదోయ్
కోట్లు సంపాదించిన కోరికలకీ
ముగింపు లేదోయ్