గా చదువులుమీకేందుకాని

 బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారు ఆంగ్లేయుల

 కాలంలో పుట్టింది మంచిదైంది  ఇప్పుడుంటే పాలకులే
 గా చదువులుమీకేందుకాని
 
 అనే వారేమో
 మా గ్రంథాలలో  లేదాని
 సనాతన ధర్మం కాదాని వాదించే వాళ్ళు 



 వెల్మజాల నర్సింహ ✍🏻

అక్షర ప్రవాహం మన సురవరం

 

మూగవోయిన తెలంగాణాకు తొలి ములుగై
గోలకొండ కవుల సంచిక తో  తొలి వెలుగై
భాషాభిమానం తో దేశాభిమానం ఎక్కువేనని
గోలకొండ పత్రిక ప్రస్థానం మన భాష గొప్పదనం
చారిత్రాత్మక నిర్ణయం తొలి సంచిక అమోఘం
సంస్కృతం లో తొలి'అలం మహీపాల తవశ్రమేణ..
ఆగలేదు ఆ కలం సాగింది నిత్యం అక్షర ప్రవాహం
యువ కవులైన దాశరథి, కాళోజీ, రామరాజుల 

రచనలను ప్రోత్సహించి మంచి మనసు చాటుకునే
హంవీర సంభవం'మే కాదు'ఆంధ్రుల సాంఘిక చరిత్ర
నిత్యం రచనలే రామాయణంతో కొత్త కోణాలే
ఆ కలంకు లేదు అలుపు, కవిత్వం,నవల, ఏదైనా
అప్పటి రాజకీయాలు సరేసరి, నైజాం పాలన కొరి
రెడ్డి హాస్టల్ బాధ్యత యువత భావితరాలకు బాసట
తన మాట తన బాట తన బతుకు మనకోసం
నిరంతరం 'అక్షర ప్రవాహమే  మన సురవరం



వెల్మజాల నర్సింహ.29.09.24
చరవాణి.9867839147.
దుప్పల్లి.

స్నేహం

 మొక్క పుట్టుకను మరియు ఎదుగుదలను చెడ్డ నీళ్లు ఆపలేవు 


అలాగే తన గమ్యం తెలిసిన వారికి  చెప్పుడు 

 మాటలు మరియు చెడ్డ స్నేహం అవరోధం కాదు

ముంచుడే

ఈశ్వరుడి కొడుకైనా
 ఈత రావాలిసిందే
 లేకుంటే భక్తి పేరుతో
 ముంచుడే
 
 భక్తులు మంచి వారే
 దేవుడికే తొందర


 

అర్థరాత్రి స్వతంత్రం



తోవంత రాళ్ళు రాప్పలే 
ఊరంత బురద మల్లె 
డొక్కు ఆటోల ప్రయాణం 
ఇదే నేటి పల్లెలో జీవనం 

వాడలో వీధి దీపాలే 
వెలిగేది పండుగ ముందరే 
ఇంటిపై కప్పులో కోతుల గోల 
వాటి పోరుకే మా బంధువులు ఢీలా 

స్వర్ణోత్సవాల భారతమ్మ 
పల్లెలో మారలేదు మా జీవితాలమ్మ 
ఎక్కడ ఆ సంబరాలు 
స్వాతంత్ర్యం లేని జీవితాలు 

చదివినా సదువులు అంతంతే 
విజ్ఞానం బుర్రలో కొంత ఇంతే 
మా నుదుట పంకిలం ఎప్పుడంతే 
పేదల జీవితాల్లో వెలుగంతే 

అర్థరాత్రి స్వతంత్రం 
అది ఎవరికీ ఏమి ఉపయోగం 
బడా బాబుల కుతంత్రం 
నాడు నేడు పేదలకు దక్కని 
స్వేచ్చా స్వాతంత్ర్యం

వెల్మజాల నర్సింహ .15.08.2024.


మట్టి మనుషుల బతుకు చిత్రం - తంగలాన్

 





పా.రంజీత్ గారి  దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్ గారు నటించిన అద్భుతమైన చిత్రం 'తంగలాన్
ఇది సినిమా కాదు జీవితాలు,అణాగారిన జనం యొక్క బతుకులు.
మాకు మంచి రోజులు వస్తాయి.మా గురించి కూడా
సినిమాలు వస్తాయి అని చాటి చెప్పిన గొప్ప సినిమా.
తంగలాన్ పాత్ర పేరు అతడే యోధుడు నలుగురు పిల్లలను పోషించే దళిత తండ్రి.రెక్కల కష్టం దొచుకునే కాలం నాటి పరిస్థితులు.

భూమి కోసం భుక్తి కోసం పోరాడి గెలిచిన యోధుడి కథ.అప్పటి దొరలు నిమ్న జాతి కులాల వారిని ఏవిధంగా వాడుకున్నారొ కండ్లకు కట్టినట్లు చూపించారు. చియాన్ విక్రమ్ నటన సహజంగా మరియు సాహసోపేతంగా ఉంది.

చచ్చి బతికే కంటే పోరాడి చవడయే గొప్ప అని
నిరూపించిన సినిమా .
పుట్టిన వాడు చావక తప్పదు కానీ రోజు భయపడుతూ బతికే బతుకు కాదాని
తన వారు చనిపోతున్న పోరాటమే జీవితమని
నిరూపించిన కథ.

తెల్లదొరలు వారి పేరుని వాడుకోని స్థానిక దొరలు
భూములు లాక్కొని దౌర్జన్యంగా వెట్టిచాకిరి ఎలా చేయించుకున్నరో చరిత్రలో రాయని నిజం
ఈ సినిమాలో ఉంది.
ప్రకృతి లో కష్టించి పనిచేసే వారికి ప్రకృతే దేవుడిని
అదే సహకరిస్తుంది ‌.
ఈ దశాబ్దకాలంలో జై భీమ్ తరువాత అంత గొప్ప సినిమా 'తంగలాన్.

వెల్మజాల నర్సింహ.18.8.24.

అక్షర సుతుడు !


 

నిలువెత్తు ధనమే వద్దులే
నీకున్న అక్షర జ్ఞానము చాలు
శ్రీనాథుడులా పాండిత్యం అవసరం లేదులే
పోతన లా పొలం పనులైనా పర్వాలేదు
పెద్దింటాని సుద్దులు అవసరం లేదులే
నేడున్న నీ మంచితనం చాలునే
అక్షరం నమ్ముకొని ముందుకు
సాగిన వారి జీవితం చారిత్రాత్మకం
అన్నమయ్య లా అలతి పదం
యోగి వేమన లా పామరుడి పద్యం
చాలును జీవిత పరమార్థం
వారి మాట,పాటే ప్రజలో అజరామరం
 వారి అక్షరమే వారి నిజమైన సుతుడు

వెల్మజాల నర్సింహ ✍🏻

చిరునవ్వే శాశ్వతమా!


 
నాలుగు డప్పులు ఏడుస్తూ
ముందు నడుస్తుంటే
నువ్వు తినలేని పేలాలు
నీ పైనుండి పడుతుంటే
చిల్లరే కదరా ఘల్లు ఘల్లు మని
 నేలమీద పడేది
పాడే కదరా పాటకు నీకు సాక్ష్యం!
గోవిందాని పలుకుతారు
నీ చెవులకు చెరిందా!
లేవవయ్య అని విలపిస్తారు
నీ కన్నేమైన తెరిచింద!

బంధవులో కొందరు
 బయలుదేరుటకు ఆరాటం
ఆస్తిలో వాటాల కోసం సంతన
మస్తిష్కంలో పోరాటం
సంతాప సభ ఖర్చుల
ఇంకొందరి ఉబలాటం

ఏమైంది ఉరుకుల
 పరుగుల జీవితం
చివరకు తెల్లని చొక్కాతో
నవ్వడం రాని ముఖం తో

బతికినంత కాలం బిజీ బిజీగా
సంపాదనే ధ్యేయంగా తలచి
చచ్చేంత వరకు నీకు సమయం
 లేదయే ,
హాయిగా నవ్వుకునే
దినం రాదయే
నవ్వుతూ బతుకు చచ్చేంత వరకు
అదే జీవిత పరమార్థం.

 వెల్మజాల నర్సింహ ✍🏻24.05.24

జాలి దయ లేని

 జాలి దయ లేని
 బండరాయి అనుకున్న
 వాటి మధ్యలో నుంచి
 వచ్చిన మొక్కను చూశా
 బండరాయి వంటి గుండెలలో
 కూడా అమ్మతనం ఉంటుందని


మే - 🌞 జూన్ 🌝

మే - 🌞


ఏమిటో ఈ ఎండలు
భూమాత పై స్వేద రంధ్రాలు
కనిపించేంతగా

 జూన్ 🌝


పచ్చదనంతో ఊపిరి
 తీసుకుంటుంది భూమాత
నిన్ననే తొలకరి జల్లులు
 మొదలయ్యాయి

వెల్మజాల నర్సింహ

శత మశక సంహార వీర

 

అనగనగా ఊరిలో రాజా అనే పిరికివాడు నివసిస్తుండే వాడు . అతనికి ఏదీ చూసిన భయమే.
చుట్టూ ప్రక్కల వారు రాజాను చూసి హేళన చేసే వారు.
పేరుకే రాజా ధైర్యం లేని కాజా అని!

 తాను ధైర్యవంతుడని నిరూపించుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేసి నవ్వుల పాలయ్యాడు.
ఎన్నో సినిమాలు చూసినా ధైర్యం రాలేదు
నాకు ఒక రోజు వస్తుందిలే అనుకున్నాడు.
పాత సినిమాలలో లాగా వర్షం కురిసిన రాత్రి
దోమల దండు రాజా పై దండెత్తి ంది .
అక్కడ మగధీర క్లైమాక్స్ సీన్ ఒకోకరు కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకే సారి పంపించు.
రాజా నరాలల్లో రక్తం ఉప్పొంగింది.
కళ్ళముందు మోత్కూరు బిక్కేరు కనిపించింది.

వెంటనే వంద దోమలనీ చంపి వాటి రక్తంతో " శత మశక సంహార వీర   మీ రాజా అని రాసుకొని హాయిగా నిద్ర పోయాడు.

ఉదయం చూస్తే పేపర్ కనిపించకుండా పోయింది ఎవరు కొట్టేశారు అబ్బ'



వెల్మజాల నర్సింహ ✍🏻26.04.24