యువత మేలుకో-Wake up youth

యువత మేలుకో 
సమాజాన్ని మార్చుకో

నవయుగం కోసం

 సంకల్పం ఏంచుకో

నీ గమ్యం తెలుసుకో
లక్ష్యంతో సాదించుకో

పగటి కలలు మానుకో 
 ప్రగతి బాట వెతుకో

నీ తెలివిని పెంచుకో

సంఘం కోసం వాడుకో

చరిత్రను చదువుకో
వీరత్వం  పెంచుకో 

నీ పుట్టుక గొప్పదని 
సమాజమే చాటుకో
-వాలని 

నేడే నిర్ణయం తీసుకో 
యువత మేలుకో. .


వెల్మజాల నర్సింహ. 12.1.20

నిజమైన నేస్తాలు (True friends)

పొద్దున్నే  స్యుారుడిని కబురేట్టి  పిలిచామా

గడియారం ముల్లుకు గతమేంత అవసరం

వాన నీటికి చెరువు గట్టుకు విడాకుల బంధమేదొ

చేప కడుపులో పిల్లకు
 సముద్రంలో ఈదటం కష్టమా

ఎగసిపడే అలలకు అలసట తేలిసేన

సంసారం నడిపే తండ్రికి
సంతోషం ఎన్ని రాత్రు
లో

పగలు రేయి అని పనిగట్టుకు లెక్కేడు తామ

ఆనందం అంగిలొ వుంటే మవసరమేదో మరిచితిమ

వయసులొ వున్నా తలంపు వడలిన పనికివచ్చేన

నడుస్తున్న చరిత్ర




నీ హృదయం స్మశానంమైతే

నీ ఏద పై చదరంగ మేనొయ్

అగ్గి రవ్వల తలంపుతో
ఆనందం పొందాలేవొయ్


నీ మనసు నీండు కోవెలైతే

భక్తి మార్గం మెండుగానొయ్

 కలియుగంలో మనుషులకు

కఫటానికి కొదవే లేదోయ్

మరణానికి భయపడితే

 జీవనం ముందుకు  సాగదోయ్

భయాలను విడితే బతుకు బంధం బలపడునొయ్

ఒడిపోవడం లో
 అనుభవం గేలుపుకు దారులు తెరుచుకునొయ్

గమ్యనికి లెక్కల బదులుగా

అడుగేసి ముందుకు సాగవొయ్

గతాన్నికి గజ్జెలు కట్టి
ఆటడడం అవసరం లేదోయ్

కోట్లు సంపాదించిన కోరికలకీ
ముగింపు లేదోయ్

నిందా సుత్తి

రోజుకు పుట్టుకతో ఉషొదయం మెుదలైయొన

రోజుకు ముగ్గింపు తొ నీ వయసే తరిగి పోయేన

దీపంలొ తైలమే
నీఆయుషు పెంచేంత

నీ మరణం తరువాత
పెట్టే దీపం కొరివి తుంచేత

మంచిని పెంచిన దీపం
మరొక్కరికి వెలుగైతే

పుణ్యమనే తైలం తొ
పెంచేన నీ ఆయుషు

గాలికి పెట్టిన దీపంలా
పిల్లలను పెంచింతే

ఆరిపొతుంటే ఆపగలవా

అందుకే అంటారు పెద్దలు

దీపం వుండగానే ఇల్లు
చక్క దిద్దుకొ

వయసులొ వున్నపుడే
మంచి పనులతో పుణ్యం పెంచుకొ


నిందా సుత్తి



తెప్పలాగ తేలియాడలి

తెలుగుకు రోగం వచ్చి
ఖండాలకు వ్యాపించాలి

తెలుగుకు కాంతి వొచ్చి
దీపంలా వెలుగొందాలి

తెలుగుకు తెగువొచ్చి
తెలుగులోనే మాట్లాడాలి

మా ఊరి కోసం"


 పాట
************

పల్లవి : ఊరు చుాడమ్మ నా పల్లె చుాడమ్మ

అందాల కుందన బొమ్మ పచ్చని పల్లె సీమామ్మ


ఒ....రేల రేలారే......
రెళ్లు పువ్వు లో  దుప్పెల్లి


చరణం :ఘడ్డీల పాలనలో జీతలతో గడిపిన

బతుకు దెరువు కోసమని బస్తీ లో బతికిన

ఊరు పై మామకారం ఉవ్వేతు పొంగేన

సన్న జాజి పువ్వు వలె గుండెలో ఒదిగేన

ఒ....రేల రేలారే......
 రెళ్లు పువ్వు లో  దుప్పెల్లి

చరణం:ఎల్లమ్మ నదితో నే పంటలను అనుకుంటే
కడుపున ఆకాలిని తీర్చేటి ముాసినది వుండే న

సబండ జాతి  కొలిచే దేవత ఎల్లమ్మ

పతి సంవత్సరం పండుగ ఘనంగా జరిగేన

ఒ....రేల రేలారే......
రెళ్లు పువ్వు లో దుప్పెల్లి


చరణం: ఎర్ర గద్దె కాడ
ఎప్పుడు చుాసిన
పదిమందికి ఎక్కువనే  కుర్చొనే వుందురా

అంబేద్కర్ విగ్రహం అయేనా ఊరికి మధ్య

హనుమన్ గుడిలో
నిత్యం పుాజలు


చరణం. .కొత్త చెరువేమేా
కొప్పుల ఊరికి

నిండ నిండిదొ పంటలకు కొదవా లేదు

తాటి వనం కాడికి
చుట్టం తొ పొయేవా

కడుపు నిండ  కల్లు
వనమే ఇచ్చేన

గాలం పట్టుకొని ముాసికి
పొయేవా

ముాడు పూటల ముసురు కొని తినవచ్చు ఒ....రేల రేలారే......
రెళ్లు పువ్వు లో దుప్పెల్లి

చరణం: మసీదు బండపై కొలువైన కంఠమైయా

కొలచిన వారికి కొంగు బంగారమాయెనా

పొచ్చమ్మ, ముత్యాలమ్మ కఠ మైసమ్మ

ఊరిని కాపాడే మావురాల ఎల్లమ్మ


తల్లుల కొలువంగ చల్ల గా చుాసేన

ఊరు చుాడమ్మ నా పల్లె చుాడమ్మ

సరదాకి @వొడ్కొ

రాత్రి  తాగిన వొడ్కొ
ఇంకా లేవలే పడక
ఉదయైంది కొడకా
కొత్తగా వచ్చింది పొరక్క
కలగా వచ్చింది పండుగ
తాగింది పొయింది దండుగ
అయ్యే రామా ఏమిటి
ఈ తాగుడు కర్మ

నుాతన సంవత్సరం


ఆదేదొ మాయ, మనలో కొత్త ఉత్సహం ...

కొని గంటలే కాని  నరాలు జీవ్వు మనే సంతోషం

ప్రపంచమే పరమానందంతొ ఆటలాడును

మద్యంతో  నాట్య మడును

నిద్ర పోకుండా చిందులేసేను

పుాజలో కోందరైతే ,పుచ్చుకోవడం లో కొందరు

కొత్త వాగ్దానాలతొ కోందరైతే, గొంతెమ్మ కోర్కెలతొ కొందరు

కిక్కుతొ కోందరైతే, భక్తితొ కొందరు

క్యాలెండర్ పంచాంగం తొ కోందరైతే, బాతాఖానీ తొ కొందరు

లెక్కలతొ కోందరైతే,ఆశతో కొందరు
నవ్వులతొ కోందరైతే,
నమ్మకంతొ  కొందరు


వయసుతొ సంబంధం లేదు

చలితో చణువే లేదు

అదేకదా మనందరి సంతోషం

నుాతన సంవత్సర స్వాగతం

శుభాకాంక్షలతో @ 2020

✍🏻మీ..వెల్మజాల నర్సింహ.
 
01.01.2020

వీడ్కోలు 2019

క్యాలెండర్ మార్చితే కష్టలే మారవులే

31st పార్టీ తొ తలరాతే మారదులే

మత్తులో మునిగితే సత్తువ కొత్తగా రాదులే

కొత్త సంవత్సారానికి రెక్కలేమి రావులే

మార్పుపంటే ఎక్కడొ లేదులే

సంవత్సరం మార్పుతో
జీవితాలే మారవులే

నీవు మారాలను కుంటే
ఏ దైవం ఆపలేదులే

పాశ్చాత్య సంస్కృతి
మనకేందుకులే

మన సంస్కృతి' ఉగాది పండుగ ముందు వుందిలే

బస్తీకి పోతున్నా: Bastī ki pōtunnā


ఊరును మరిచినవ  వలస బాట పట్టినవా

తల్లిని మరిచినవ కన్న పేగును వదిలినవా

భుజలపై నీను పెంచిన తండ్రి  బారం విడిచినవా

బతుకు దెరువు కోసం బస్తీ కి వచ్చినవా

పొట్టకుటికే నీ పయనం
కట్టు బట్టలే నీ నయనం

కారు చీకటే నీ స్నేహం
కడలి అంచులే నీ కుటీరం

రెక్కలపై నీవు రొక్కం కోసం

 పట్నం పనికి వచ్చితివా

బతిమాలే బంధువులండరు

భాధను పంచుకునే భాషా తెలువదు

సకలజనుల సమేళనం

సంపాదనకు సమారోహం

వారం వారంతం సందడి
బస్తీ జీవనం మనందరి

చిన్న మాట. .

ఎంతటిగడ్డివాముయైన
 చిన్నపాటి నిప్పు మిణగురుకు 
బూడిదైనటు,అలాగే మనలోని ఆహం
 మంచి మిత్రుల సాంగత్యం 
 వలన మన దరి చేరదు.

చుక్క.

ఆకాశంలో ఒక చుక్క
ఆ చుక్కని చేరా సిర చుక్క
చక్కని రాతతో సిర చుక్క
అక్కున చెర్చెన అక్షర ముక్క
ముక్కల ముతిని చెక్కగ
చక్కగా కవితాగ  నిలిచేన
చక్కని చుక్కని కవితాని పొగిడేర

ననంద


తరగతిలో టీచర్ సరదాకి కొన్ని ప్రశ్న లు అడుగు తున్నాడు

అందరి సమాధానాలు ఇంచుమించు ఒకేతీరుగా వున్నాయి,కాని

ననంద 'అనే బాలుడి సమాధానాలు వేరుగా వున్నాయి .

టీచర్ :సృష్టిలో నీవు చుాసిన అందమైన వారెవరూ?

ననంద: మా అమ్మ గురువు గారు

టీచర్: విశాల ప్రదేశం ఏది?

ననంద: మానాన్న గారు.

టీచర్: మంచి మిత్రుడేవరు  ?

ననంద: కాలము గురువు గారు.

టీచర్: సుఖం అంటే ఏమిటి?

ననంద: ఆర్థం తొ వచ్చేదనుకొవడం .

టీచర్: మరి కష్టం అంటే?

ననంద: ఇష్టంగా లేనిది ఎదైనా.

టీచర్ :దేవుడేవరు

ననంద: నమ్మకామే దేవుడు గురువు గారు


 టీచర్ ననంద జవాబులకు సంతోషించాడు.

చివరకు గురువుగారు ఇలా సెలవిచ్చారు

"నలుగురు నడిచినా బాట నడక సులభం కానీ నీవు 
నడిచినా బాటలో నలుగురు నడవాలి అదే
 ప్రతేకాకర్షణగల మనిషి లక్షణం.

కాల కేళి "✍🏻

మనసున్న మహారాజుకు మగువలు ఆరుగురు

వంతుల వారిగా వచ్చిపోవుదురు
రాణులలొ మహా రాణి వసంత వయ్యారి
చైత్ర,, వైశాఖ మాసంలో
యవ్వన కేళి

నవయుగ ఆరంభ
ఉగాది రవళి

తెలుగు కవులకు
పోటీల పండగ

గ్రీష్మ రాణి రెండువదైన
ఎండలు మెండుగా మండేన

బండల గుండెలు అదిరేన

జ్యేష్ఠ, ఆషాఢ మాసంలో  పెండ్లి  భజా భజంత్రి మేగేన

సృష్టికి బీజం వేసేన

అన్నం పెట్టె రాణి పంటల పరికిణీ  వర్ష వర్షిణి

మేఘనికి గాలం వేసి
 వర్షని రప్పించేన

పడి పంటలతొ ప్రకృతి పులకించేన

శ్రావణ, భాద్రపద మాసంలో అన్న చెల్లల బంధం

చవితి పండగ మెుధం

నాల్గవ రాణి శరత్దృవు
ఆశ్వయుజ, కార్తీక మాసంలో

దసరా దీపావళి
పండుగలు తెచ్చేన

పంచవ రాణి హేమంత

మార్గశిర, పుష్య మాసంలో
చలితొ సరదా
సంక్రాంతి ముగ్గుల పరదా

పండిన పంటలు ఇంటికి చేరగ

కడపటి రాణి శిశిరం

మాఘం, ఫాల్గుణం మాసంలో

చెట్టు కొమ్మలు కొత్త బట్టలతొ

లేలేత రంగుల సిగ్గుతో

హొళీ ఆటలు  రంగుల పువ్వులతో

ఇలా దాగుడు ముాతల కాలంతో

సాగే మానవ "కాల కేళి"

నేటి రాజకీయ పోకడ:




ధనం వుంటే కుర్చేగదారా

గధలాగ జనమే కదరా

కుర్చీవుంటే ఖర్చేగదారా

కసాయి వాడిలా దోసేయ్ బ్రదరా

కుర్చీ పై మమకారమే కదరా
మంది పై కారం చల్లారా

మనోడిని మంత్రిని చేద్దాం కదరా

ఆడ పిల్లలా మానం దొచేద్దం పదరా

చెరసాల కృష్ణుడి
జననం కదరా

మనమే కాదోయ్ స్వామిలను తొడుకు పొద్దం పదరా

లంచాలను పంచుకు తిందాం సొదరా

 రాజుల బతుకేదం బ్రదరా

వాడి - వేడి


ఓటర్ దేవుళ్ళు అందరుా
కొటర్ మనుషులు కొందరు
సమానత్వం  రాతలలో
కులం కులం మని చేతలలో
ఓట్లా కోసం ఒక మాటా
గేలిచినంక మరొతుాట
తాతల పేర్లతో జపం జపం
నీతి మాటలతోనే   గఫ్పం గఫ్పం
 ఓటమి ఒక గుణపాఠం
గెలుపు ఒక గర్వం గౌరవం
కాలగామనంలో కొని రోజులు
చీకటి రోజులు మరువం
పరువం
న్యాయం జరిగేది నాలుకపై పైన
నిజం ఎప్పుడు నిజం కాదు
నీది నాది పిచ్చి వేదేనయే

నది -River

దిజ గంగ నదిగా మారి
భగీరథుడిని కోసం వచ్చే

జటాజుటం పైన చేరి
నాన్నటికి నదిగా వచ్చే

పాపలను తొలగించ
ప్రత్యక్షమై ప్రవేశించే

భీడుభుాముల
సస్యశ్యామలం చేయ

ధరణి పై ఆరుదేంచే

గంగ సింధు యమున బ్రహ్మపుత్ర సరస్వతై
మాము పవనం చేయా

సింధూ రావి బియాస్ సట్లెజ్ చీనాబ్ పేర్లతొ

 గోదావరి కృష్ణ పెన్న కావేరి నర్మద తపతై

లేడి పిల్లలా ఆడవి
 కన్యా లా నదిగాంచే

పరుగుల నది చివరకు
సాగరంలొ నిలిచే

భారతవాని నదుల ఆవనిగా మనం కొలిచే

నదియే నాభి కదా మనదేశాన్నికి
 
********************


దేవతలు

అదృశ్య రుాపం లో లేరు
దేవతలు
అడుగడున కుశలం మడుగుతుంటారు

ఆకలవుతుందాని ఆవుతొ అన్నాను
ఆది నాకు పాలిచ్చి ఆదరించింది

దప్పికేస్తుందాని చెప్పితే వాగుతొ
దోసిలతొ నీరు తాగి పొమ్మంది
ఆటలడుకొని ఆలసి పొయాను
కొమ్మ లో పండు చెట్టు కొసు కొమ్మంది

కొక్కొరొ కొ....




కంగీ కి అంగే లేదు
కాలానికి కళ్లేం లేదు
ఆకలికి పళ్లెం లేదు
ఆనందనికి అవధి లేదు
మనందరికీ సమయం లేదు
రాజకీయానికి విలువ లేదు
చట్టానికి  చుట్టం లేదు

క్షమాపనకు మించిన శిక్షే లేదు

తాగ్గిన వాడికి నరకం లేదు
ఇతరులను ఒర్వ లేనివాడికి సుఖం లేదు

జీవితమంటే ?

సముద్రానికి మానవ మనుగడకు 
చాలా దగ్గర పోలికలు వున్నాయి.

అలల లాగే మానవ జీవితం లో
 కష్టాలు వస్తు పోతు వుంటాయి.

కానీ మనిషి సుఖలా గురించే
 ఆలొచిస్తుంటాడు.

అలల లకు అలుపు లేదు 
జీవితాన్నికి గమ్యం లేదు. 
దారి వెతుక్కుంటూ ముందుకు సాగాలి.

సముద్రం లాగా శాంతిగ వుండాలని
 అనుకుంటే,
 దాని తర్వాత వచ్చే పరిమాణం
 తీవ్రంగా వుంటాయి.

పై పైకి వీర్ర వీగతే సముద్రం
 లాగా సమాజం అణచి వేస్తుంది.

కాలమే సమాధానం 
,అనుభవమే గుణపాఠం.
సముద్రం లో ఈదటం
 కష్టం కాని జీవితం లో ముందుకు  
సాగడం చాలా కష్టం 
దానికి ఒకటే
ఆయుధం సహనం. 


@వెల్మమజాల నర్సింహ.

అమ్మ పాట:

పచ్చని పచ్చని

చేనుపచ్చని కన్నయ్య

పంట చేల మధ్య టుంగు టుయాలా కన్నయ్య

ఎన్గుయేంకటమామ
వచ్చిపోతాడు కన్నయ్య

జోల చీరలొ నీను  జొ..... కొడుతాడు కన్నయ్య

కముజు పిట్ట తాత కలవరపేడితేకన్నయ్య

వడ్లపిట్ట మామ వంత పడేన కన్నయ్య

కోకిలమ్మ లా మధర గానమే కన్నయ్య

మైమరచి నీను నిద్ర పుచ్చేన కన్నయ్య


పచ్చ పచ్చని పచ్చిగడ్డి పరకలే
కన్నయ్య

పాట పాడుతుంటే వంత పడేన కన్నయ్య

తలరాత రాసిన బ్రహ్మ దేవుడే కన్నయ్య

అడివమ్మ ఒడిలొ పేరగమని రాసేన కన్నయ్య


నీ బొసి నవ్వులే నా కన్నయ్య

నా మధ్యాహ్న బువ్వ అయేరా కన్నయ్య

సి'గగన 'తార (Cinema Star)


ఆకాశం లో ఒక తార
 తన  గమ్యం మరచి
భుా లోకం వచ్చేన
మైమరచి
తిమిరంతొ విరహాం పొంది
రవి కిరణం పై మెాహం వలచి
తను మరిచేన యవ్వనం కవ్వించేన


రాజమహల్ విడిది  విడిచేన
రంగుల లోకంలో నడిచేన
తార ముచ్చట పడేన
మన దీప వెలుగులో
తార తారగా రాక
సినీతారగ వచ్చేన

******************

             వెల్మజాల నర్సింహ

వక్షోజాలపై వస్త్రం ధరిస్తే పన్ను.. వక్షోజాల పరిమాణం బట్టీ పన్ను





చరిత్ర పుటల్లోకి వెళ్తే ఎన్నో విషాధగాథలుంటాయి. అప్పట్లో కేరళ ట్రావెన్‌కోర్ రాజులు విధించిన పన్నులు చాలా దారుణంగా ఉండేవి. 18 వ శతాబ్దంలో ట్రావెన్కూర్ ( తిరువనంతపురం) ను పాలించిన రాజులు రకరకాల పన్నులను విధించారు. ట్రావెన్‌కోర్ రాజులు స్త్రీల రొమ్ములపై కూడా పన్ను విధించేవారు. ఈ పన్ను చాలా దారుణంగా ఉండేది. ఈ పన్ను చెల్లించడానికి మహిళలు చాలా ఇబ్బందులపడాల్సి వచ్చేది.

మార్తాండ వర్మ అవి కేరళను ట్రావెన్కోర్ మహారాజు మార్తాండ వర్మ పరిపాలిస్తున్న రోజులు. మార్తాండవర్మ వక్షోజాలపై పన్ను(ముళకరం)తో పాటు తలక్కారం అనే పన్ను కూడా విధించారు అంటే గడ్డాలు, మీసాలపై కూడా రాజు పన్ను విధించారు. అలాగే మహిళలు, పురుషులు ఆభరణాలు ధరించాలన్నా అప్పట్లో పన్ను కట్టాల్సిందే.

ఉన్నత వర్గాల వారు మాత్రమే

ఉన్నత వర్గాల వారు మాత్రమే ట్రావెన్కోర్ రాజ్యంలో అప్పట్లో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే వక్షోజాలపై దుస్తులు ధరించాలి. సమాజంలో రాయల్టీ ఉన్న మహిళలు మాత్రమే వక్షోజాలను దాచుకోవచ్చు. దళిత , గిరిజన , బడుగు , బలహీన వర్గాల మహిళలు వక్షోజాలపై వస్త్రాల్ని ధరించకూడదు. బ్రాహ్మణ కుటుంబంతో పాటు కొన్ని అగ్రకులాలకు చెందిన స్త్రీలు లోన రవికె వేసుకుని, పైన చీర కొంగు కప్పుకునే అర్హత ఉండేది. ఇది రాజు ఆజ్ఞ.


అక్షరం పలికితే అమ్మ భాషలో అందం ✍🏻

అక్షరం పలికితే అమ్మ భాషలో అందం

భావ వ్యక్తీకరణకు అమ్మ భాషతొ బంధం✍🏻

కాడేద్దు ,ముల్లుకర్ర

 నేేలమ్మకు రైతు నేచిన చీర పచ్చని 
రంగుని పొందేనొయ్
కాడేద్దు ,ముల్లుకర్ర తొ కలిసి 
ముందుకు నడువాలొయ్
అడివమ్మ పేరంటానికి అడిగిందొ కొక్కా
నీలాంబరి యై కనువిందు చేయు
నిటారుగా నిలబడే నొయ్
పచ్చని పంటల నుండి
జీవి మనుగడ పొందేనొయ్

ముందడుగు





నీవు వేసే పతి అడుగు
పంకజమే కావొచ్చు

దానిలో నుండి పరమాన్నం పుట్టొచ్చు

కష్టంచి పనిచేస్తే ఫలితం వుండొచ్చు

తొందరగా కాకుండా సమయం పట్టొచ్చు

కాలంలో పాటు వయసు
పయనం లో

సంపద పైన ఆశ పేరుగావచ్చు


పుణ్యం పాపం మంటూ
కాలం గడుపవొచ్చు


చివరకు మిగిలేది
ఏమి లేదాని భాధ పడవచ్చు

"నీ ధైర్యంమే నీ భవిష్యత్తును
 నిర్ణయించవచ్చు

ఇదే నీ ఆయుధంగా
ముందడుగు వేయవచ్చు
********

వెల్మజాల నర్సింహ
10.12.19