దసరా SONG

 పల్లవి:

దసరా అంటే పూల పండుగే

పండుగంటే ఇల్లు సందడే

ఊరంతా పూలపందిళ్లే

కొత్త బట్టలతో విందులే


చరణం – 1:

అడవిలోన పాలపిట్టకు

అమ్ములున్న జమ్మిచెట్టుకు,

జమ్మి ఆకులతో అలాయ్‌ బలాయ్‌

ఆప్యాయంగా పలకరింపులే


దసరా అంటే పూల పండుగే

తెలంగాణకు మురిపాల పండుగే


చరణం – 2:

పల్లెపల్లెలో పండుగ కోలాహలం,

పిల్లాపాపల ఆటల సందడి

అక్కాచెల్లెళ్ల ఆనందాలూ,

అన్నదమ్ముల ఆత్మీయతలూ


జమ్మి ఆకులు చేతిలో పెట్టి

పెద్దల ఆశీస్సులు అందుకొని

సుఖసంతోషాలు పంచుకుంటూ

సంబరాల దసరా జరుపుకుందాం


నర్సింహ వెల్మజాల ✍🏻

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి