పల్లవి:
చిన్న చిన్న పాదాలంట.. దేవుడి రూపాలంట
గుట్టపైన గుండాలంట.. జీవమున్న చేపలంట
||చిన్న చిన్న||
చరణం 1:
దేవుడి చేపల రూపాలంట..
మూడు నామాల చేపలంట!
మత్స్యగిరి హరి రూపమంట..
కనులారా చూస్తే పుణ్యమంట
||చిన్న చిన్న||
చరణం 2:
నరసింహుని అవతారమంట..
హనుమంతుడు క్షేత్రపాలకుడంట!
మంచి చేసే దేవుడంట..
శ్రీలక్ష్మీ సమేత రూపమంట
||చిన్న చిన్న||
చరణం 3:
గుండములోన స్నానాలంట..
స్వామివారి దర్శనాలంట
భక్తితో కొలిచి మొక్కితే చాలు..
పాపాలన్నీ తొలుగునంట!
||చిన్న చిన్న||
చరణం 4:
ప్రశాంతతకు ఇది నిలయమంట..
వ్యోములు ఋషుల పుణ్యభూమిఅంట
అభయ వృక్షం దేవుడంట
గుండము నీటిలో దైవత్వమంట
మత్స్యగిరి నామ జపమంట..
తలుచుకుంటే మనసు శాంతించునంట
||చిన్న చిన్న||
రచన. నర్సింహ వెల్మజాల
గ్రామము. దుప్పల్లి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి