విజయదశమి .


 మన సినిమాల్లో  హీరోయిన్ లను అందంగా సుకుమారంగా పాటలకే పరిమితంగా చూపిస్తారు.

చివరకు హీరో ఫైటింగ్ చెస్తుంటే పురుషాధిక్యమే ఆనుకొని చూసి ఆనందిస్తాం 

కానీ మన పూజనీయులు త్రిమూర్తులే (విష్ణు, ఈశ్వర, బ్రహ్మ) కాదు అంతకు మించి వారి తయారు చేసిన శక్తి ఉన్నది అదే(దుర్గా దేవి) అమ్మా వారని చరిత్ర చెబుతుంది.

ముఖ్యంగా ఆడపిల్లలకు ధైర్యసాహసాలు నింపే అద్భుతమైన చరిత్ర.

.ఓం శ్రీ దుర్గాయై నమః

  సర్వ మంగళ మాంగల్యే 

 శివే సర్వార్థసాధకే 

 శరణ్యే త్రయంబకే 

 దేవి నారాయణి నమోస్తుతే 

 " దేవీ మహాత్మ్యం గ్రంధం లో దుర్గమ్మ గురించి సవివరంగ ఉంటుంది.

రూపం : దుర్గాదేవి ఆదిమ లలితా దేవి యొక్క రూపాలలో ఒకటి. ఆమె మొత్తం విశ్వానికి తల్లి మరియు తండ్రి అని చెబుతారు. 
 మహిషాసుర సంహారం: మహిషాసురుడు అనే రాక్షసుడు మూడు లోకాలను భయభ్రాంతులకు గురిచేసినప్పుడు, బ్రహ్మ, విష్ణు, శివుడు కలిసి పది చేతులతో శక్తివంతమైన స్త్రీ రూపాన్ని సృష్టించారు. ఆమె దుర్గాదేవి. 
 యుద్ధం : సింహంపై స్వారీ చేస్తూ, దుర్గాదేవి మహిషాసురుడిని, అతని సైన్యాన్ని ఓడించి, ప్రపంచాన్ని రక్షించింది. 
 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి .
   
 దుర్గాదేవి పేరుకు అర్థం "అజేయమైనది" లేదా "దగ్గరకు చేరుకోవడం కష్టం".
ఆమెను హిందూమతంలో అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు.
నవరాత్రుల సమయంలో ఆమెను 9 వివిధ రూపాలలో (నవదుర్గలు)
నవరాత్రులలో దుర్గామాత తొమ్మిది రూపాలను పూజిస్తారు, వీటిని
 నవదుర్గలు అంటారు. ఆ తొమ్మిది రూపాలు: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, మరియు సిద్ధిదాత్రి. ఈ తొమ్మిది రూపాలు శక్తి, బలం, జ్ఞానం, మరియు దయను సూచిస్తాయి. 

వెల్మజాల నర్సింహ ✍🏻

రాఖీ పండుగ @2025

 మన సంస్కృతి మరియు సంప్రదాయాలను 

రాబోయే తరాలకు అందించడమే పండుగల ఉద్దేశం 

బంధువులంతా  కలుసుకోని 

సాధకబాధకాలు చెప్పుకోవడం 

మరో విశేషం.

పేద ధనిక లేకుండా అందరూ తమకు

 తోచిన విధంగా ఉన్నంత లో కొండంత

 ఆప్యాయంగా గడపడమే పండుగ.


తోబుట్టువుల పండుగ రాఖీ పండుగ 

మరోసారి బాధ్యత గుర్తుచేసే పండుగ.


శుభాకాంక్షలతో....

వెల్మజాల నర్సింహ 

దుప్పల్లి 'శ్రీ ఎల్లమ్మ దేవి పాట'


పండగంటే పండగే ఎల్లన్న
ఊరంతా పండగే మల్లన్న
  మనము కొలిచే దైవం ఓరన్న
 గుడిలో కొలువైన  ఎల్లమ్మ
 మంగళవారం నాడు మాయమ్మ
 ఊరంతా భక్తితో బోనాలే ఎల్లమ్మ
 బుధవారం నాడు పండుగ ఎల్లన్న
 కోళ్లు యాట ఉండగా మాయన్న
 డప్పుల చప్పుడు ఎల్లన్న

 జమిడిక మోతలు మారన్న
 తల్లిని తలుచుకుంటూ ఎల్లన్న
 ఊగే శిగాలు మారన్న
బైండ్ల వారి క్రతువులు ఎల్లన్న
 గావు కేక లే   ఇక మాయన్న
 రంగుల పటం మేసి ఎల్లన్న
 ఘనముగా కొల్చుదాం రావన్న
 పోత రాజు కేమో ఎల్లన్న
 దండాలు పెట్టుదము పులన్న
 ఇంటింటా బంధువులు ఎల్లన్న
ఊరంతా భక్తులు చంద్రన్న
 దుప్పల్లి గ్రామం లో ఎల్లమ్మ
 పచ్చని పొలాలలో మాయమ్మ
 చూడ చక్కని తల్లి ఎల్లమ్మ
 ఊరిని కాపాడే మావురాల ఎల్లమ్మ
 పండుగంటే పండగే ఎల్లన్న

              వెల్మజాల నర్సిం

ప్రతిసారి ఓటమే నా నేను ఎలా ముందుకు సాగగలను?



మీరు ఓడిపోయినప్పుడు వైఫల్యం శాశ్వతంగా అనిపిస్తుంది. మీరు గెలిచినప్పుడు విజయం శాశ్వతంగా అనిపిస్తుంది
ఇది సహజం.

ఒక పురుషుడు అభివృద్ధి చేసుకోగల గొప్ప కండరం ఆటుపోట్లకు వ్యతిరేకంగా ప్రయాణించే అతని సంకల్ప శక్తి,
సంకల్పమే విషయాన్ని కి చిరునామా

మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీ అలవాట్లు నిజంగా పరీక్షించబడతాయి. విషయాలు పరిపూర్ణంగా లేనప్పుడు కూడా వేగాన్ని కొనసాగించడం కీలకం,

మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా?
 మరింత సిగ్గు లేకుండా ఉండండి. మీరు దాన్ని సంపాదించే వరకు.

మీరు ఒక స్త్రీ తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా?

 
మీకు నచ్చిన స్త్రీతో డేటింగ్ చేయవద్దు. మిమ్మల్ని ఇష్టపడే స్త్రీ తో డేటింగ్ చేయాలి వెంబడించవద్దు, ఆకర్షించ వద్దు, ఆకర్షణ కొంత కాలమే.

మీరు కలిసే అత్యంత విజయవంతమైన పురుషులు అంత తెలివైనవారు కాదు. వారు వేగంగా కదులుతారు, రిస్క్ తీసుకుంటారు మరియు చాలా పని చేస్తారు,

ఇతరులు మీపై కలిగి ఉన్న నమ్మకాన్ని అంతర్గతీకరించుకోకుండా ఉండటానికి మీ గురించి బలమైన అభిప్రాయాన్ని పెంచుకోండి,

పరిమితులు, పరిమిత నమ్మకాలు మరియు పరిమిత వ్యక్తిగత కథనాల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి,
ప్రపంచం చాలా పెద్దది నీ.. నా ఆలోచనల కన్నా


మీరు బాగా పని చేయడానికి ప్రయత్నిస్తున్నంత
 కాలం, చివరికి మంచి ఫలితం దక్కుతుంది.


అంతే జీవితం... రిలాక్స్.
వెల్మజాల నర్సింహ ✍🏻19.07.25

వాన జాడే లేదు!

 పచ్చిగా ఉండాల్సిన పొలంలో

నాగలి కర్రు దిగనే లేదు  
దుక్కి దున్నిన ఏమి లాభం
గింజలలో జీవం పోయడానికి
నీళ్ళే ప్రాణాధారం
నారుమడి పచ్చదనం ఎక్కడ
చిగురుటాకులాకు అదే చివరి రోజు
గిజ్జిగాడి గొంతు ఎప్పుడో ఎండింది
నల్లని రేగడులు నెర్రలతో
గొంతెండిన   పిల్లలా కనిపిస్తున్నాయి
ఎర్రని రేగడిలో కనిపించే
ఆరుద్ర పురుగుల జాడే లేదు
పత్తి చేలో మొక్కలు అమ్మ నాన్న
లేని అనాధల కనిపిస్తున్నాయి
కంది,పెసర ఊసే లేదు
ఆముదాల ఆశ లేదు
నువ్వులు ,మిరప గింజలు
నువ్వా నేనా అంటున్నాయి

మృగశిర కార్తె లో మురవలసిన చినుకు
ఆరుద్ర కార్తె వరకు కు జాడ లేదు

పరమేశ్వర గంగను విడువుము
మా ప్రాణాలు కాపాడుము
మబ్బులోన దాగున్న చినుకమ్మ
మా మొర విని ఇక్కడ కురువమ్మ


వెల్మజాల నర్సింహ.
  గ్రామము.దుప్పల్లి.
చరవాణి.9867839147.

  


అమ్మ మాటే జోల పాట

 అమ్మ మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట
మురిపంగా ముర్రు పాలతో
  అంగిట గోరు ముద్దుల తో
అపురూపమైన దేవత అమ్మ

మొదటి మాటే అమ్మా
ఆ పిలుపుతో జన్మ ధన్యం అమ్మ
బెజ్జ మహాదేవి చరిత్రలో అమ్మా
శివునికి సేవలు చేసిన ఆ అమ్మా
నేటి కి పాఠ్యాంశంగా నిలిచేనా అమ్మా

 పేరుగాంచిన మరో తల్లి యశోదమ్మ
మన్ను తిన్నాడని ఆ అమ్మ
కృష్ణుడు చెవిని మేలిపిన చరితం కదా అమ్మ

కడుపులో నే ఉన్నప్పుడు ప్రహ్లాదుడు
నారాయణ మంత్రం విన్న లీలావతమ్మ
అమ్మ మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట

చందమామ కోసం చిలిపి రాముడి గోలా
అద్దం లో ప్రతి బింబం చూసి ఆనందం వేళ
కౌసల్యామ్మా మురిసేనా   ఆ అమ్మా

ఛత్రపతి కోసం జిజియాబాయి అమ్మా
శివాజీ వీరుని చేసిన మహా తల్లి ఆ అమ్మా
అమ్మా మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట

రెండు అక్షరాల పిలుపే అమ్మ
నడిచే దైవం ఆ అమ్మ
ప్రేమను పంచే అమ్మా
లోకంలో సరిలేరు నీకెవ్వరు కదామ్మ
పిల్లల భవిష్యత్తుకై నిత్యం తెప్పించే
మహా జన్మ అమ్మా!
అమ్మ మాటే జోల పాట
స రి గ మ ల తో జగతికి పూల తోట

బద్రీనాథ్ పాట సాహిత్యం

 

ముక్తిప్రద  యోగసిద్ద నమో నారాయణాయ 2
అలకనందా  జలపుణ్యఫల నమో నారాయణాయ
బద్రీకాశ్రమానివాస దేవా నమో నారాయణాయ
నీ నామమెంత మధురమో నమో నారాయణాయ
ముక్తిప్రద  యోగసిద్ద నమో నారాయణాయ 2

అరవింద వల్లి  అమ్మ దయతో నమో నారాయణాయ

 దర్శించుకున్న కలుగు పుణ్యం నమో నారాయణాయ

 అణువణువునా నీ నామమే నమో నారాయణాయ

వినిపించెను ఆ ప్రాంతమంతా నమో నారాయణాయ

ముక్తిప్రద  యోగసిద్ద నమో నారాయణాయ 2



ఆలోక్య సర్వ శాస్త్రాణి విచార్యచ పునః పునః
ఇదా మేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!

కన్నీళ్లు కొబ్బరికాయ నీళ్ళు

 కన్నీళ్లు కొబ్బరికాయ నీళ్ళు

దేవుని సృష్టి, ఎందుకంటే 
తన ఎద పగిలితేనే
 బయట పడతాయి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం


  కష్టపడే శ్రమజీవుల
  పని గంటల కోసం
జరిగిన పోరాటలేన్నో

బతుకు దేరువు కోసం
 జరిగిన పరిణామాలెన్నో

ఎర్ర జెండా రెపరెపల కోసం
ప్రాణాలు వదిలిన
మనుషులేందరో

నేడు ' ప్రపంచ కార్మిక దినోత్సవ
పోరాట యాదిలో


వెల్మజాల నర్సింహ ✍🏻

మంచి వాక్యం!



కష్టపడుతూ ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ పైకి 

ఎదిగినా వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది.

అడ్డదారులో ఒక్కసారిగా పైకి ఎదిగే వాడికి

 నువ్వెంత అనే అహంకారం ,గర్వం ఉంటుంది.



వెల్మజాల నర్సింహ ✍🏻

ప్రతిసారి క్షమిస్తున్నారు కదా

  ప్రతిసారి క్షమిస్తున్నారు కదా 

 అని మంచివాళ్ళని మళ్ళీ మళ్ళీ చులకన గా చూడకు

  వాళ్ళు ఒక్కక్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే

 వేరేలా మారడానికి నిమిషం కూడా పట్టదు

ఉగాది పాట

 

పచ్చని పల్లెలో
అల్లంత దూరాన
ఆ  చల్లని  గాలులతో
వినిపించే గానాలే
కోయిలమ్మ రాగాలంటా
ఆ పచ్చని పైరు లో
సాయంత్రం వేళల్లో
పూసిన వేపల పై 
కనిపించక వినిపించే
మన మనసును దోచే టి
పక్షుల రాగాల టా
అల్లంత దూరాన
ఆ  చల్లని  గాలులతో..

మామిడి తోటలో
మధ్యాన్నపు వేళల్లో
మామిడి పిందెల పై
చిలుకలు సందడి చేయగా 
కనువిందుగా ఉండేనా
మామిడి తోటంతా
అల్లంత దూరాన
ఆ  చల్లని ని గాలులతో
వినిపించే గానాలే
కోయిల రాగాలంట

కొత్తగా పెళ్లైన
యువజంట లా ముచ్చట్లు
పరీక్షల కోసం పిల్లలు ఇక్కట్లు
వేసవి ఎండల తో
కులీ అన్న లా సతమతం
అల్లంత దూరాన
ఆ  చల్లని గాలులతో
వినిపించే గానాలే
కోయిల రాగాలు

ఇల్లంతా బంధువుల తో
ఊరంతా సందడి తో
పచ్చడి ఫలహారం తో
పసందైన వంటకాల తో
పంచాంగం వినడం కై
మనసంతా ఉబలాటం
కవులు కవితా లతో
ఆనందంగా గడిపేది
ఉగాది పండుగే నంటా

అల్లంతదూరానా
పచ్చని పల్లెలో
ఆ  చల్లని ని గాలులతో
వినిపించే గానాలే
ఉగాది కవితా  లేనంటా

జీవితంలో స్నేహితుల కంటే

 జీవితంలో స్నేహితుల కంటే శత్రువులే 

ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే వారి బుద్ధి అలాంటిది.

నూతన సంవత్సరం @2025

 పన్నెండు ఆకుల కాలం చెల్లింది
కొత్త ఆకులు చిగురించాయి
వాటిని రోజు చూస్తూ
 గడపడమే నూతన జీవితం.




వెల్మజాల నర్సింహ ✍🏻