అంతం లేని కథ వుంటుందా
పందెం లేని ఆట వుంటుందా
స్వార్ధం లేని ప్రేమ వుంటుందా
ఆశ లేని జీవి వుంటుందా
నిశా లేని పగలు వుంటుందా
మరణం లేని జననం వుంటుందా
జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే.
అంతం లేని కథ వుంటుందా
పందెం లేని ఆట వుంటుందా
స్వార్ధం లేని ప్రేమ వుంటుందా
ఆశ లేని జీవి వుంటుందా
నిశా లేని పగలు వుంటుందా
మరణం లేని జననం వుంటుందా
పల్లవి:జేబుకు పెట్టిన జెండా
జనం గుండెలో నిండా
వందేమాతర పిలుపు
మనందరి బాధ్యత తెలుపు
త్రివర్ణ వర్ణపు జెండా
నేడు రెపరెపలాడే చుాడు
వందేమాతరం... వందేమాతరం
చరణం:
పల్లవి: ఆదివారం అంగడి
ఆటో బస్సుల సందడి
బావ పోదామా అంగడి
సంతలో చుాడ సందడి(2)
:ఆదివారం"
చరణం: వారం వారం అంగడి
ఆటో అన్నల సందడి
అమ్మ అక్కల అంగడి
అందమైన సింగిడి
బావ పోదామా అంగడి
పట్టు చీరల సందడి (2)
:ఆదివారం :
చరణం :నగలు నకిలేస్స్ ల అంగడి
ముత్యాల దండల పందిరి
బావ పోదామా అంగడి
పండుగ సామానులకై సంతకి (2)
:ఆదివారం :
పల్లవి: కొత్త లుంగీ కట్టి కట్ట పైన
కదిలేటి బావయ్య
నన్ను ఒక సారి చుాడయ్య
గట్టు మీద గడ్డి పరకలు
గుబురుగా వుండే బావయ్య
నా గుండె లదిరే రావయ్య
:కొత్త లుంగీ కట్టి:
చరణం :కట్ట పైన కముజు పిట్ట క
లవర పెట్టె బావయ్య
నా గుండెలదిరే రావయ్య
వరి చేల ఎండ్రిగాడు
నా ఏంటా పడే చుాడయ్య
నీవు కట్ట దిగి రావయ్య
:కొత్త లుంగీ కట్టి:
చరణం: మిణుకు మనే
మిడతలు
వరి చేలో ఉడుతలు
తాటి మీద కోతులు
టిక్ టిక్ మని పిట్టలు
నేను తట్టుకోలేక వున్న బావయ్య
కట్ట దిగి రావయ్య
:కొత్త లుంగీ కట్టి:
చరణం: మేన మరదలని అలుసా
కొత్త లుంగాని బిరుసా
నా గుండె నిండా నువ్వుయ్య
నన్ను కట్ట పైకి తోలుక
పోవయ్య
:కొత్త లుంగీ కట్టి :
********
వెల్మజాల నర్సింహ