చెవి దిద్దులు!
నువ్వొక లేలేత రెమ్మవై
పిల్లగాలులకు నాచెంతకు చేరగా,
నేనొక కొమ్మనై...
నాలో కలిసిపోమంటి
నీ చెక్కిలిపై కురులు
మెరిసెనా దగదగలాడే మిణుగురులవలె
లేలేత ఆకుపై మంచు బిందువులవలె
నీ కర్ణ దిద్దులు కనపడే వేళ...
ఉదయాన్నే పూసిన పువ్వువా?
లేక నడిరేయిలో తిరిగే
దారి తప్పిన దేవకన్యవా?
నువ్వు ఎవరైతే నాకేమిలే...
నా మనసును మీటే
నీ చెవిదిద్దుల మధుర సవ్వడులు
నర్సింహ వెల్మజాల ✍🏻

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి