బతుకమ్మ

  తంగెడు పువ్వుల తల్లివి నువ్వే
బంగారు బతుకమ్మ
మా గుండెలలొ గుడి కడుతామె నవదినంబు
బతుకమ్మ


మా ఆడపడుచుల కరములె బతుకమ్మ

నిన్ను కొలిచేందుకు
ఆట పాటలే బతుకమ్మ

తెలంగాణా తల్లివై బతుకమ్మ

ప్రపంచనికే
 పండుగైతివే బతుకమ్మ

గునుగు పువ్వులను గుబురుగా మలచి బతుకమ్మ

రంగు రంగుల పుష్పాలతొ కొలిచేదము బతుకమ్మ

దసరా పండగ ముందరా నిలిచి బతుకమ్మ

మా ఆసుర గుణములను తొలగించెదవు బతుకమ్మ

బతుకమ్మ. ..బతుకమ్మ
మా తెలంగాణా బతుకమ్మ 
 
********************

వెల్మజాల నర్సింహ🖋

మంచి మాట Great motivated word

ఓటమి ని తలరాత కాదు,
 గెలుపు ఒక్కరి సొత్తు కాదు
.నిన్నని మరిచి 
నేడు శ్రమించి చూడు రేపు

గెలుపు తప్పక నీ వాకిట 
తలుపు తడుతుంది.
@
Defeat is not writing
, victory is not everyone's money
  .. Forget yesterday and watch 
today and win tomorrow must win your door.

చిన్న నాటి మైత్రి

పల్లవి:నీదీ ...నాదీ ...నీది నాదీ మన ఊరి కహనీ...

నీవు ...నేను. ..నీవు నేను మన మైత్రి పురానీ

:నీదీ నాదీ:

చరణం: పలక బలపం
పశువుల వెంటా

మన చదువూ సవారి

గొళ్లీలు గొంగళి పురుగులు గొబ్బంళ్ళాంట

మన ఇంట పహరీ

 :నీదీ నాదీ :

చంద్రయాన్ -2( Chandrayaan 2)



చంద్రయాన్ జాబిలి చేరా జాగు చేసేన

జామురాతిరిలొ జాబిలమ్మ జాడ కనబడలేదా

వేగంలో గమ్యం మరిచి
గగనంలొ వుండేన

మామాను చూడ ఆరాటంలో దారే మరిచిపోయేన

మనుషులు పంపిన బొమ్మని మబ్బులతొ కపేసేన

చంద్రయాన్-2 భారత జాతి తలమానికమా

మరోసారి కబురు పంపుమా. .
 
 
*******************

వెల్మజాల నర్సింహ 🖋

నవశకం



గగనానికి నిచ్చెన వేసి 
చంద్ర మండలం చూసొద్దామా 
మబ్బులతొ స్నేహం చేసి 
చినుకులను పిలిచి వొద్దామా

కాశ్మీర్ కి 370 అధికరణానికి స్వస్తి 
పలికి బంధం పెంచుకుంద్దామా

అందానికి పందెవేస్తే
కాశ్మీర్ ని ముందెద్దామా

డిస్కవరీ చానెల్ లో 
సాహసానికి బాట యేద్దామా

భారత సంస్కృతి గొప్పదని చాటింపు 
చేసేద్దామా

చేప పిల్లల మనం కుడా సంసారంలొ  ఈదేద్దామా

సమయమే తెలియకుండా చాటింగ్ తొ బతుకే ద్దామా
దేశ సంరక్షణ విషయం లొ ఐక్యంగా పోరాడు ద్దామా

జీవితంలో మనిషి


నెత్తిన ముట్టను పెట్టుకు 
ఊరంతా తిరుగొ
ద్దామా

కుల పిచ్చిని మాటుకు 
దాచి గొడవంత చేసేద్దామా

పొట్ట కుటికొసమే జీవన మని
 మరిచి ధనాన్ని
పొగెద్దామా

సుఖం వుంటుందాని
  భ్రమతొరాజకీయమే నడిపే
  ద్దామా

ఆది బీక్షువని మరచి
 మహావిష్ణు వలె బతుకే ద్దామా

అక్షరం: ✍



అక్షరం మాట్లాడుతుంది సవాలక్ష న్యూస్ లతో

అక్షరం పోట్లాడుతుంది
నిత్యం విద్యార్థులతో

అక్షరం అనియు తానేై కాపాడుతుంది కొందరిని


అక్షరం పొట్టకోసిన
అబ్బని వారేందరొ

అక్షరం లక్షల విలువ దస్తావేజులలొ

అక్షరం మారితే బతుకే  మరేను కొందరిది

అక్షరం ఆయుధం,
 మనిషి మనుగడకు అవసరం

అక్షరం తొ పండితులై
ఆనందంగా  జీవిస్తారు

అక్షరమే సత్యం నిత్యం నాటి జీవనం

"చిన్న నాటి మిత్రమా "



సమయంలేని పత్రమా

రాయలేని కాలమా రాలేను మనింపుమా

పిట్ట గుాడులలొ కుశలమా
బద్ధకం తొ బధరితనమా
ధనం వుందని ఆహంకరమా

ఇగొ" చీకటని తెలవని
చిన్ననాటి మిత్రమా
కుశలమా

జీవితం అనే రేసులొ గమ్యం గగనమా

తోచిన దారిలో పయనమా

తలంపున తరగతి గదిలో
అలరిముాక మిత్రమా

సంసార సాగర నౌక పెద్దతనమా
చిన్ననాటి మిత్రమా
కుశలమా.
🌿నర్సింహ.వి 

సమయమే నీసంపాదన

సమయమే నీసంపాదన
సంస్కారమే నీ బలం

ఆందోళనే నీ శత్రువు
ఆహంకరమే నీపతనం

చినుకులు

పలుచని పలుకే చులకన
చులకన మనసే విరహాన

 విరహాన వాక్కే కలహాల

పడుచున పరుగే కరిగేన

కరిగిన వయసే ముసెలేన

వంకర సొగసు నెపమేన
నెరిసిన జుట్టు తెలిసేన

రైతు


భూమికి నేస్తమా. ...మేము బతుకేందుకు అన్నమా
చదువుకొన్ని  మిత్రమా
సరిలేరు యేవ్వరు ...
నీకష్టమా
పొలంలో నుంచి హలంతొ పసిడి తీసి
పంకజలొ పడి వుండేవు
అడవిలొ జీవనమా ఆరుద్రకు నేస్తమ
రేయింబవళు కష్టమా
బసవన్నలతొ విడదీయ రాని బంధమా

పచ్చని మెుక్కలతో సహాజీవనమా

మానవజాతికే వెన్నెముక  రైతానేగా
 
 
******************
వెల్మజాల నర్సింహ 

తొలకరివాన

నల్లని మబ్బుల చాటున
మేఘమ వర్షించుమా

 నీ పిల్ల గాలులకు మదియెంతొ హయ్


నాటి పల్లెలు

చుట్టూ చెట్లు గడ్డి చామంతి పువ్వులు

గరక మధ్యలొ దారులు
గంగా నదిలాంటి స్వచ్ఛమైన నీళ్ళు

కనుమరుగైన పల్లెలలో


వసుదైక కుటుంబం పసందైన పిలుపులతొ

పల్లెంతా చుట్టాలు
సమిష్టిగా పనులతో

కనుమరుగైన పల్లెలలో

పల్లె లో ఒకటే బడి
అదే మా మెుదటి గుడి
పలక,  బలపం సంచితొ
కాకుంటే లోపల సర్వ పిండితో
కనుమరుగైన పల్లెలలో

ఆనందమే

ఆనందం అంచుల వెంట కంచేసి బతుకేదమా

గిరిగిసుకు కట్టుబాట్లులతొ

సంఘంలొ చిందేదమా


రాయి విసిరి పండు పొందే ఆనందం ఆనందమేగా

అమ్మ తనం కోసం గాయం
అడుగడుగున ఆనందమే

పచ్చిక పై కురిసే మంచు
జగమంత ఆనందమే

నీలో నీవు నీతో నీవు గడిపిన క్షణమైన ఆనందమే

నేనంటాను


                                      Zphs Duppelli




Iబ్రేకులు ఉనాయి చేతిలో



సైకిల్ పడింది గోతిలో



దపిఎ తిరదాని నేనంటాను


మండుటెండలొ విస్కీ తాగితే





II 
పై పై అందం కల సుమా…


లోపలిదంతడొలసుమా



మోసపొకాని నేనంటాను


నా జీవితమె ఉదాహరణ సుమా…






III హృదయంతరంలొ ప్రేమపిచ్చి


అది అందనిదాక్షా  తీపి బాచి


 ప్రేమలో దాహం తిరదాంటాను


జీవితానుభవసారం ఇదెసుమా…













(9వతరగతిలో)



వరకట్నం







వరకట్నమా...వధువుపాలిటపిశాచమా
కంప్యూటర్ యుగమా … కన్యలపాలిటశాపమా
ఆడపిల్లల తండ్రులగుంఢెలలొ నిత్యం రగులుతునా 
కుంపటి  వేదనమా …






కర్యెషు దాసి కరనెషుమంత్రి
భొజెషు మాతా షయనెషు రంభయాని
స్త్రీనిపూజిస్తారట ఈ దేశంలో


స్త్రీని గౌరవిస్తారట ఈ రాష్టము లో






అర్ధ రాత్రి స్వాతంత్ర్యం అంధకార బంధురం
అంగాగం దోపిడైన భారత మాత జీవితం
బడి పంతులైతె పది లక్షలు,ఇంజనీరైతె ఇరవైలక్షలు
బ్రతుకనెరిచిన  బడి పంతులు …. కట్నలపోషకులు 






అమెరికాలోడాలర్లుపండును
ఇండియాలోవరకట్నలు పండును
కొడుకుల కన్నతండ్రుల భాగ్యమా
అదృష్టవంతులు మీరు వడ్డించిన విస్తరి మీ జీవితం






కన్యాశుల్కం నాటి  కాలమేసుమా
ఆదునిక యుగకర్తలు మళ్లీపుట్టలి

గురజాడ ,కందుకూరి స్ఫూర్తినీంపుకొని
వరకట్నపిశాచిని  తరిమికొడధాం


















"అంబేడ్కర్‌"




తరగతి గదిలో అవమానం... తరించేన  జగత్తు నేడే

ఛత్రపతి రాజ్య ంపై చెలరేగిన నీ కలం 

నాసిక్ నడిబోడ్డులో నవజాతికై మేాగిన నగరా. ..

కుల రాకాసి నడీ విడిచి కుళును తులు చేసి 

అంటరానివారంటే కంట నిప్పులు చేరిగి

భగభగమండే అగ్ని కణ 
జ్వాల వై. ...పోరాట వారాదివై ..

అగ్రవర్ణాల ఆహని అగ్నికి ఆహుతి చేసి

భారత రాజ్యాంగ పితామహుడై చిరకాలం
 మా గుండె లొ పదిలం 

.వెలుమజాల నర్సింహ.

ముంబయి నగరం


ఆటో బస్సుల ఆరాటం
అంతేలేని జనసాంద్రం
ఉరుకుల పరుగుల జీవనం
ముంబయి నగరం

.పది అడుగుల గుడిసెలో
పది మంది జీవనం

పక్కనే మెురీ పక్కకే పడక

పదికంచల బొజనం
పదిమంది తలదచుకునే గుడు

పొట్టపొసుకునే ముంబాయి నగరం

కారులొ తిరిగే దొరలు కొందరు
కడుపు కుట్టి కొసం కష్టపడేవారు ఎందరొ

అందమైన భవనలు ఎన్నో
ఆకాశ భవనలు మరేన్నో

సోమరులుండరికడ ముంబాయి నగరం

.యుగ పురుషుడు
నడిచిన నేల

సకలజనుల సమేళనల తీరం
అరేబియా అంచున నగరం
ముంబయి నగరం

Dated. 07.11.2018.Chaityana Bhoomi.

నేటి రాజకీయం

రాజకీయ చదరంగం
రౌడీల కదనరంగం

కాకుల కూతలతొ
పరోక్ష మాటల యుద్ధంతొ

కాకుంటే ముాటల కోసం
బడాబాబులతొ స్నేహం

భయం భయం జీవనం
భరొస లేని పాలనలో

బంగారు భవిష్యత్తు వారి ఆయుధం
గారడీ మాటలతో బురిడీ మెసాలతొ
తొడ కొట్టి మీసం తిప్పి తొండ వేషలతొ

రాజకీయ చదరంగం నాడు మనుషులతో  కదనరంగం 

జీవననందం


పది రోజుల ఆయుష్ పెరగలంటే ఒక మెుక్క నాటండి .
పది సంవత్సరాల ఆయుష్ పెరగలంటే
 పది మెుక్కలు నాటండి

కానీ

వందేళ్ల ఆయుష్ కావాలంటే "
ఇంటి చుట్టూ వనం పెంచుకోవాలి.
 
 

చీకటిలో ఒక్కడివి....

చీకటిలో ఒక్కడివి చింతిస్తు కుర్చుటవ

నీతి సుాత్రల మననంతొ
తిమిరాని తిడుటుంటావ

నీలో వున్న ధైర్యం నడిపించు నిన్ను గమ్యం
 డబ్బే వుందని గుమ్మం
దాటకుంటే

జబ్బులతో జీవితం డాబ్బగా మిగిలేన

నవ్వుతూ గడపని రోజున

నరకానికి దగ్గర అవుతావు

చిన్ననాటి మిత్రుల కలయికతో

పెంచేన నీలో నవ వసంతం

బావిలో కప్పల అప్పడం కాదు జీవితం

ప్రపంచమే కుగ్రామం
అనుకుంటే

నింగికి నిచ్చెన వేయగలవు
********

వెలుమజాల నర్సింహ. .

*పేదవాడు- ధనికుడు *



దుప్పెల్లి లో శేఖర్ ,సైదుల్ చిన్ననాటి మిత్రులు


ముంబయి నుండి వచ్చిన శేఖర్ తొ పిచ్చపాటిలొ. ....

సైదుల్: ఒరేయ్ పేదవాడు ధనికుడు తేడేంటీ. ..రా.....

శేఖర్ :పేదవాడు అంటే
దొరికినప్పుడే కడుపునిండా తింటారు

ధనికుడాంటే. ..సంపదలునా కడుపునిండా తిన్నలేడు

:వెన. ..

సండే 🐓(Sunday)



వారంతం లొ సండే
ఐన మా ఇంట్లొ అండే

మే"నెలలోఎండలు మండే

ఎంత తగ్గినా కడుపు కుండే

ఆఫీసు పోవాలి మండే

ఉదయం పుాట ఎండకు తల మండే

చలపతిరావు- వెంగళరావు

చలపతిరావు &వెంగళరావు మంచి మిత్రులు 🤔

వెంగళరావు : ఏరా చలపతిరావు ఏమి కుార ఈరోజు. ..

చలపతిరావు: చేపల కుార. ..

వెంగళరావు: చేపలనపుడు ముళ్లు

చలి కాలాంనపుడు వణుకువుంటుదిరా

దానికి. ..
ఒళ్లు మండిన చలపతిరావు

చలపతిరావు: వెంగళరావు లొ పంగలేనొ వెతుకుతున్నా. .. నీవు ముల్లు వెతుకొ👻

మేడే





నేలను ముద్దాడిన పువ్వు
  నెలవంక చేరేన

మట్టిని నమ్మిన మనిషికి
మమకారమే మిగిలేన

ఆకాశంకు గురి నీదైతే
అవకాశం దారి చుపెడుతున్న

మట్టిలో మాణిక్యలకు
మాలిన్యం తొలిగెన

ప్రపంచా గతి మార్పు
 కోసం యుగ పురుషులు
పుట్టుక తధ్యం

ప్రపంచా కార్మిక ఐక్యత
నేడే వర్దిల్లాలి

పోరాట పటిమ కోసం 
"మేడే "లే జరగల