అర్థరాత్రి స్వతంత్రం



తోవంత రాళ్ళు రాప్పలే 
ఊరంత బురద మల్లె 
డొక్కు ఆటోల ప్రయాణం 
ఇదే నేటి పల్లెలో జీవనం 

వాడలో వీధి దీపాలే 
వెలిగేది పండుగ ముందరే 
ఇంటిపై కప్పులో కోతుల గోల 
వాటి పోరుకే మా బంధువులు ఢీలా 

స్వర్ణోత్సవాల భారతమ్మ 
పల్లెలో మారలేదు మా జీవితాలమ్మ 
ఎక్కడ ఆ సంబరాలు 
స్వాతంత్ర్యం లేని జీవితాలు 

చదివినా సదువులు అంతంతే 
విజ్ఞానం బుర్రలో కొంత ఇంతే 
మా నుదుట పంకిలం ఎప్పుడంతే 
పేదల జీవితాల్లో వెలుగంతే 

అర్థరాత్రి స్వతంత్రం 
అది ఎవరికీ ఏమి ఉపయోగం 
బడా బాబుల కుతంత్రం 
నాడు నేడు పేదలకు దక్కని 
స్వేచ్చా స్వాతంత్ర్యం

వెల్మజాల నర్సింహ .15.08.2024.


మట్టి మనుషుల బతుకు చిత్రం - తంగలాన్

 





పా.రంజీత్ గారి  దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్ గారు నటించిన అద్భుతమైన చిత్రం 'తంగలాన్
ఇది సినిమా కాదు జీవితాలు,అణాగారిన జనం యొక్క బతుకులు.
మాకు మంచి రోజులు వస్తాయి.మా గురించి కూడా
సినిమాలు వస్తాయి అని చాటి చెప్పిన గొప్ప సినిమా.
తంగలాన్ పాత్ర పేరు అతడే యోధుడు నలుగురు పిల్లలను పోషించే దళిత తండ్రి.రెక్కల కష్టం దొచుకునే కాలం నాటి పరిస్థితులు.

భూమి కోసం భుక్తి కోసం పోరాడి గెలిచిన యోధుడి కథ.అప్పటి దొరలు నిమ్న జాతి కులాల వారిని ఏవిధంగా వాడుకున్నారొ కండ్లకు కట్టినట్లు చూపించారు. చియాన్ విక్రమ్ నటన సహజంగా మరియు సాహసోపేతంగా ఉంది.

చచ్చి బతికే కంటే పోరాడి చవడయే గొప్ప అని
నిరూపించిన సినిమా .
పుట్టిన వాడు చావక తప్పదు కానీ రోజు భయపడుతూ బతికే బతుకు కాదాని
తన వారు చనిపోతున్న పోరాటమే జీవితమని
నిరూపించిన కథ.

తెల్లదొరలు వారి పేరుని వాడుకోని స్థానిక దొరలు
భూములు లాక్కొని దౌర్జన్యంగా వెట్టిచాకిరి ఎలా చేయించుకున్నరో చరిత్రలో రాయని నిజం
ఈ సినిమాలో ఉంది.
ప్రకృతి లో కష్టించి పనిచేసే వారికి ప్రకృతే దేవుడిని
అదే సహకరిస్తుంది ‌.
ఈ దశాబ్దకాలంలో జై భీమ్ తరువాత అంత గొప్ప సినిమా 'తంగలాన్.

వెల్మజాల నర్సింహ.18.8.24.