దేవుడెవరు (who is the God)


దుప్పల్లి ఊరిలో  శివయ్య యొక్క మూడో సంతనమే ఎల్లయ్య.
వారి తాతల కాలం నుండి పటేలకాడ కుండేడు- బుడెడు వడ్ల  కు 
జీతం చేస్తూ వస్తున్నారు.
పచ్చికతో కుడినా పంట చెళ్ళలో పశువులను మేపడమే ఎల్లన్న పని
పటేల్ గారి చక్రాల బండి ని ముస్తాబు చేసి గీత్తలతొ తీపేవాడు.

ఎల్లన్న వారి కుటుంబం పటేల్ గారి వద్ద జీతలతొ 
జీవితాలు గడుస్తున్నాయి.

మల్లీబావి కంచెలొ సీతాఫలలాకు కొదువలేదు.

తాటి పండ్లు,సీతాఫలలే ఛద్దనం బువ్వ ..

పట్నం నుండి పటేల్ గారి
అల్లుడు దసరా సెలవులకు ఊరికి వస్తుండని తీసుకురావడానికి
 పటేల్ ఎల్లన్నకు వాకాబు చేసిండు.


చక్రాల బండితొ  పక్కనే వున్న నర్సాపురం నుండి 
తొలుకవస్తున్న సమయంలో

ఎల్లన్న దొతి జబ్బల అంగి చూసినా అల్లుడు
వెటకారంతొ ఒకింత నవ్వుకున్నడు.

దారంత  గిత్త ల బండి యొక్క గజ్జెలు చప్పుడు తొ పచ్చని
 పొలాల మధ్య సాగుతుంది.

చెరువు కట్ట కాడికి వచ్చి రాగనె బండి ఆగిపోయింది.
ఎల్లన్న బండి దిగి పక్కనే వున్న ఎల్లమ్మ గుడి లో దేవుని మెుక్కడం చుసిన

అల్లుడు విసుగుతొ
దేవుడు లేడు ఇదంతా
కాలయాపన  "అసలు దేవుడెవరు అన్నాడు కోపంతో. ..


బండి ముందుకు సాగుతోంది ...


ఎల్లన్న నెమ్మదిగా.

 ..సార్. .

చెప్పారా

అయ్యా

గా ...పట్టణాలలో పెద్ద చదువులు చదివిన మీరే
దేవుడు లేడంటే యేటాండి. .

అంతేందుకు నేనొక్కటి
అడుగుతా చెప్పండి. .


నీళ్ళంటే ఏమిటి?

అల్లుడు గారి సమాధానం H2O అన్నాడు. .

దానికీ నవ్విన ఎల్లన్న
మరియు గాలంటే అన్నాడు

అల్లుడు.: O2 అన్నాడు

అయ్యా.  మీ పిచ్చి జవాబులు ఆపండి

ఎల్లన్న. ..
అందరిని నడిపించే శక్తి
వివిధ రుాపాలలొ వుంటుంది

నీరు, గాలి కూడా దేవుడే

దేవుడంటే నమ్మకం, భరొస. .

మనుషులు తమ ఇష్టమైన రుాపాలలొ కొలుచుకుంటారు..

మనందరిని నడిపించే శక్తియే దేవుడు. .
అన్నాడు. ..

ఎల్లన్న. .

కాసేపు మౌనం.  ..

అంతలొ ఇల్లొచింది.
********
బండి దిగ్గన
అల్లుడు ఎల్లన్న ను కౌగింలించుకొని

నా ఆహంకారం తొలగించిన దేవుడవు
ఎల్లయ్యగారు అన్నాడు. .


వెల్మజాల నర్సింహ 🖋

No comments:

Post a Comment