డబ్బుంటే దాచుకో
విద్యా వుంటే పంచుకో
కానీ రక్త దానం తెలుసుకో
రక్తదానం మహా దానం
మరో మనిషికి ప్రాణాదానం
నీలో ఊటబావి అది, నిత్యం
ప్రవాహిస్తునే వుంది
ఎదలో శుభ్రత ఎక్కడికో
పరుగులు
ధమనులు కార్మికులు
సిరలు మన ఉద్యోగులు
సెలవులే వుండావు ,వారి
జీతం లో కోతలే లేవు
ఎర్ర రక్త కణాలు మన
బలమైన సైనికులు
ఆకు కూరలు అవీ మనఆరోగ్యం
పెంచునులే
ఖర్జూర బాదం మన కోసం
శక్తి నిచ్చేవి లే
నడక వ్యాయామం
రక్త ప్రసరణ మన చేతుల్లో
రక్త దానం చేస్తే నరాల
సత్తా పెరుగును లే
రక్త హీనత రాకుండా
కోత్త సత్తువ జేరునులే
క్యాన్సర్ కు కాళ్ళేం వేసి
కంచే దాటుకుండా చేయునులే
రక్త దానం చేసేదాం మన
ఆరోగ్యాన్ని కాపాడుదాం
అత్యవసర పరిస్థితులలో
నలుగురి ప్రాణాలు కాపాడేదాం
*****************
వెల్మజాల నర్సింహ.20.3.22