రాసేదేదో రాసేయ్
నెటింట్లో లేదా వంటిట్లో
కవిలా ఒక కవితా
రాయి గురించో లేదా
రవి గురించో
ఆలోచనలకు అడ్డు పడకు
తోచిందేదో తోసేయ్
అర్థం కాకుంటే వారి ఖర్మ!
కథలో రాజకుమారి
కవితా లో కుక్క పిల్ల
పొరుగింటి పడుచుపిల్ల
ఏదైనా కథా వస్తువే
అమ్మ ప్రేమతో లాలి పాట
గోళీలాట కాడ గోల గోల
తాత అరుపులు
ఆకాశం లో మెరుపులు
రాసేదేదో రాసేయ్
నవ్వే వాళ్లు నవ్వుతారు
నవ్వని వాళ్లు తల పట్టుకుంటారు
బుర్రలో తలంపుకు
బుడి బుడి గా అడుగులు
వేయించి
తరాల మీవారి కోసం
అక్షరబద్ధం ఇప్పుడే చెసేయ్
రాసేదేదో రాసేయ్
వెల్మజాల నర్సింహ. 26.12.21