చీకటి వెంటాడుతోంది -The darkness is haunting

ఆకాశంలో మబ్బులు

 దారంతా రాళ్ళు రాప్పలు

 చేరాలి ఇంటికి 

చెప్పులే మెాయాలి నాబరువు 

 గుండెలో భయం కడుపులో 

ఎలుకల కయ్యాం

 నన్ను చీకటి వెంటాడుతోంది 

 **************

  వెల్మజాల నర్సింహ 15.10.21

విజయదశమి

దసరా అనగానే గడిచినా తొమ్మిది రోజులు

 సరే కాని పదవ రోజు నీ జీవిత మలుపు కావాలి

 అవే పది నిర్ణయాలు ఐదు చెడ్డ అలవాట్లు మనుకో 

ఐదు మంచి అలవాట్ల ప్రణాళిక రచించుకొ పెద్ద నిర్ణయాలు 

కాకుండా మాములే అయుండొచ్చు ఒక పేపర్ పై రాసి ఎక్కడో దాచు

 జీవితంలో ఏది వచ్చిన స్వాగతించు ఎందుకంటే అది ఒక గమ్యం

 తెలియని ప్రయాణం మన కష్టార్జితం పై మన రోడ్డు వుంటుంది

 గతుకుల లేదా ముళ్ల కంపా! అందమైన సి. సి రోడ్డ నీ మీదే ఆధారపడుతుంది

 . పయనం నీది గమ్యం నీది మధ్యలో వచ్చిన వారు మధ్యలో పోతారు 

 చివరి వరకు ఏలా వెళుతావొ నీ ఇష్టం దారి చుాపడం సమాజం పని బారం

 దేవుడి పై వేసి ముందకు సాగడమే వెనుకకు చూస్తే ముందుకు సాగలేవు 

 నీ చుాపు ఎప్పుడూ ఇప్పటి నుండి ముందుకే సమయం అందరికీ సమానం 

కాని సమాజంలో కొందరే చరిత్రలో నిలిచిపోతారు ఆలోచించి అడుగు

 వేస్తావు కాదు వెలుతురు లాంటి అక్షరం ఇస్తున్నా ఆయుధంగా 

మార్చుకుంటావో నీ ఇష్టం

 

 

 వెల్మజాల నర్సింహ. 15.10.21